టాటా మరణం తరువాత TCS ఉద్యోగులకు బిగ్ షాక్, ఆ కఠిన నిర్ణయం ఏంటంటే..?
టీసీఎస్.. చాలా మంది సీనియర్ ఎంప్లాయిస్ కి ఈ పెర్ఫామెన్స్ బోనస్‌లో కటింగ్స్ చేసినట్లు తెలుస్తుంది. టాటా మరణం తరువాత ఇలా జరగడం టెక్కీలకు నిజంగా షాకింగ్ విషయం అనే చెప్పాలి. ఎందుకంటే TCS కంపెనీలో ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగంతో సమానమని భావిస్తుంటారు. ఉద్యోగులకు మంచి జీతం, బోనస్, ఇంక్రిమెంట్లని ఇస్తుందని మార్కెట్లో టాక్ ఉంది. అలాంటిది టాటా మరణం తరువాత ఇలాంటి వార్తలు రావడం నిజంగా షాకింగ్ అనే చెప్పాలి.
కొన్ని రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తున్న విషయం ఏమిటంటే.. కొంతమంది ఎంప్లాయిస్ వేరియబుల్ పేమెంట్స్ లో కేవలం 20-40 శాతం వరకు మాత్రమే అందుకున్నట్లు తెలిసింది.. కొంతమందికి మాత్రం జీరో పర్సెంట్ అంటే అసలు వేరియబుల్ పే ఇవ్వలేదని తెలుస్తుంది. అయితే జూనియర్ టెక్కీలకు ఈసారి కూడా కంపెనీ కంప్లీట్ వేరియబుల్ పే ఇచ్చినట్లు సమాచారం. దీనికి ముందు మూడు నెలలో కూడా టీసీఎస్.. దాదాపు 70 పర్సెంట్ దాకా వేరియబుల్ పే ఇచ్చినట్లు తెలుస్తుంది.
కానీ గతంతో పోలిస్తే ఈసారి చాలా మందికి కూడా కోతలు పడ్డాయని సమాచారం. ఎందుకంటే చాలా మంది ఉద్యోగులు వేరే ఇతర కారణాల వల్ల ఆఫీసులకు సరిగ్గా రాలేకపోయారు . అలాగే చాలా మంది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కి అలవాటు పడ్డారు. అలాంటి వారిని కచ్చితంగా వారంలో అన్ని రోజులు ఆఫీసులకు రప్పించేందుకు.. టీసీఎస్ కొన్ని నెలల కిందట వేరియబుల్ పేను ఆఫీస్ అటెండెన్స్‌కు లింక్ చేసింది.
ఈ అటెండెన్స్ పర్సెంటేజ్ ని బట్టి వేరియబుల్ పేలో కట్టింగ్స్ ఉంటాయని తెలిపింది. 85 శాతం అటెండెన్స్ ఉంటేనే.. ఫుల్ వేరియబుల్ పే ఉంటుందట. అలాగే ఇంటర్నల్ బిజినెస్ యూనిట్ వైస్ పెర్ఫామెన్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకుంది TCS. ఇదీ సంగతి. మరి దీని గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.