చేమ దుంప తింటున్నారా.. ? ఈ విషయాలను తెలిస్తే..?
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది: టారో రూట్ స్టార్చ్ వెజిటేబుల్ అయినప్పటికీ, ఇది రక్తంలో చక్కెర నిర్వహణకు రెండు రకాల కార్బోహైడ్రేట్‌లను కలిగి ఉంటుంది. అయితే చేమదుంపలు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. మిగతా దుంపల లాగే వీటిలో కూడా పిండి పదార్థాలు ఎక్కువే. ఐతే ఇవి గుండెకు చాలా మంచివి. వీటిలోని పీచు, యాంటీ ఆక్సిడెంట్ల కాంబినేషన్ ధమనులలో కొవ్వు నిల్వ ఉండకుండా చేస్తుంది.
అరుదుగా లభించే విటమిన్ బి-6 చేమ దుంపలు తింటే వస్తుంది. గుండెజబ్బులకు, హైపర్ టెన్షన్‌కు కారణమయ్యే బ్లడ్ హోమోసిస్టిన్ స్థాయిలను తగ్గించడానికి అవసరమైన ‘ఇ’ విటమిన్‌ను ఈ దుంపలు అందిస్తాయి. బీపీని సెట్ చేసే పొటాషియం వీటిలో పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు వీటిలో ఉండే డియోస్కోరిన్ అనే ప్రోటీన్ గుండె జబ్బులూ, హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది: చేమ దుంపలో స్టార్చ్ పుష్కలంగా ఉంటుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే రెండు రకాల కార్బోహైడ్రేట్‌లను కలిగి ఉంటుంది. చామ తినడం వల్ల కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ మరియు శోషణను నెమ్మదిస్తుంది. భోజనం చేసిన వెంటనే రక్తంలో చక్కెర పెరుగుదలను నిరోధిస్తుంది. చామ దుంప బరువు తగ్గడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఇది రోజంతా కేలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది. చామ దుంపలోలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే.. చామ దుంపను మీ ఆహారంలో చేర్చుకోండి.
చేమ దుంపలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. వీటిలోని డైటరీ ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించి, విష పదార్థాలు పేరుకుపోకుండా కాపాడుతుంది. కొలన్ క్యాన్సర్, ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్‌ల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది : పోషకాలు సమృద్ధిగా ఉన్న చామ దుంపను తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది,. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.