ఈ పండు తరచూ తింటే కేన్సర్‌ను కూడా నివారిస్తుంది.
కంటి చూపు మెరుగు పర్చటంలో కర్బుజ కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ ఎ కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.ఈ పండులో ఉండే బీటాకెరోటిన్ క్యాన్సర్ కణాలను తొలగించి, ప్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. తెల్ల రక్త కణాల వృధ్దిలో కూడా ఈ పండు ఉపయోగపడుతుంది. అయితే ఖర్బూజ తింటే..ఛాతీలో మంట తగ్గుతుంది. మూత్రాశయంలోని మలినాలు శుభ్రమౌతాయి. ఇందులో షుగర్, కేలరీలు ఎక్కువ మోతాదులో ఉండనందున..డయాబెటిస్ రోగులకు కూడా మంచిది.
బరువు తగ్గించుకోవాలనుకునేవారు ఆకలిగా ఉన్నప్పుడు ఖర్బూజ తినడం ప్రయోజనకరం. గుండె సంబంధిత వ్యాధులే కాకుండా కేన్సర్ వ్యాధిని నియంత్రణలో కూడా ఖర్బూజ దోహదపడుతుంది. కార్బోహైడ్రేట్ల వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు చర్మాన్ని కూడా కాపాడుతుంది. అంతేకాదు ఖర్బూజలో కొవ్వు తక్కువగా ఉండటం వల్ల అధిక బరువున్నవాళ్లు కూడా నిరభ్యంతరంగా తినవచ్చు. ఇందులో ఉండే ఫైబర్..కొద్దిగా తినగానే కడుపు నిండిన అనుభూతి కల్పిస్తుంది.
అతి ఆకలిని నివారిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఖర్బూజ క్రమం తప్పకుండా తింటే..శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. మరోవైపు ఖర్బూజ పండ్లలో అధికమొత్తంలో ఉండే విటమిన్ ఎ, సిలు కంటికి అవసరమైన పోషకాల్ని అందిస్తాయి. కంటిపాపను బలోపేతం చేస్తాయి. ఇందులో అధికమోతాదులో ఉండే పొటాషియం గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. ఖర్బూజలో ఉండే అడినోసిన్ అనే పోషకపదార్ధం ఇందుకు ఉపయోగపడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
మలబద్ధకం సమస్య ఉన్నవాళ్లు క్రమం తప్పకుండా ఖర్బూజ తీసుకుంటే..ఆ సమస్య పోతుంది. ఇందులో ఉండే నీరు, ఫైబర్ ఇందుకు ఉపయోగపడతాయి. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. డయాబెటిస్ నియంత్రణలో ఖర్బూజ కీలకంగా పనిచేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ సమతుల్యంగా ఉంటాయి. ఇక అన్నింటికంటే ముఖ్యమైంది కేన్సర్ నివారణలో అవసరమైన రక్షణను అందిస్తుంది. విటమిన్ సి, బీటా కెరోటిన్‌లు కేన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తిప్పికొట్టడంలో సహాయపడతాయి. ఫలితంగా శరీర కణాలు దెబ్బతినకుండా ఉంటాయి.