News

ఒక కమర్షియల్ యాడ్ కి ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

ఒకప్పుడు తెలుగు హీరోలు ఒక్కో సినిమాకు 12 కోట్లు నుంచి 15 కోట్ల మధ్య పారితోషికం అందుకుంటేనే.. అమ్మో అనుకునేవాళ్లు. కానీ రాజమౌళి దయవల్ల టాలీవుడ్ మార్కెట్ ఆకాశమంత పెరిగింది. మన సినిమాలు బాలీవుడ్‌లోనూ సత్తా చూపిస్తున్నాయి. దాంతో మన హీరోల రెమ్యునరేషన్‌కు కూడా రెక్కలొస్తున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న హీరోలు ఒక్కో సినిమాకు 50 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నారు.

అయితే హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ మూవీపై తారక్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇక ఎన్టీఆర్ 30 తర్వాత హిందీ మూవీ వార్ 2లో భాగం కాబోతున్నాడు. అది ఫినిష్ చేసిన తర్వాత వచ్చే ఏడాది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాఫియా బ్యాక్ డ్రాప్ కథతో మూవీ చేయనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించనుంది.

ఇదిలా ఉంటే పాన్ ఇండియా లెవల్ లో తారక్ బ్రాండ్ ఎస్టాబ్లిష్ కావడంతో వ్యాపారులు తమ ప్రొడక్ట్ ని మార్కెట్ చేసుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ తో ఒప్పందాలు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ మెక్ డోనాల్డ్ జూనియర్ ఎన్టీఆర్ తో తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఒప్పందం చేసుకుంది.

మెక్ డోనాల్డ్ బ్రాండ్ అంబాసిడర్ గా తారక్ తో చేసుకున్న అగ్రిమెంట్ కోసం సంస్థ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ క్రింద చెల్లించిందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కమర్షియల్ యాడ్ షూట్ కోసం డేట్స్ కూడా కేటాయించడం జరిగిందంట. ఇండియా మొత్తం తమ మెక్ డోనాల్డ్ బ్రాండ్ ని తారక్ ప్రమోట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నవరత్న ఉత్పత్తులకి సౌత్ ఇండియాలో తారక్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మెక్ డోనాల్డ్ కూడా అతని ఖాతాలోకి వచ్చి చేరబోతుంది.

దీనితో అతని బ్రాండ్ వేల్యూ కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక మెక్ డోనాల్డ్ ప్రమోషన్ ఎన్టీఅర్ 30 మూవీకి కూడా కొంత హెల్ప్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ బ్రాండ్ ప్రమోషన్ తో దేశ వ్యాప్తంగా ఎన్టీఆర్ చరిష్మా ఎస్టాబ్లిష్ అవుతుంది. అది ఆటోమేటిక్ గా ఎన్టీఆర్ 30 సినిమాకి మంచి హైప్, బిజినెస్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker