Health

టమోటాలు తినడం మానేస్తే పురుషుల్లో ఆ సామార్థ్యం తగ్గిపోతుంది.

ఇటీవల కాలంలో చాలా మంది కొత్తజంటలు సంతానలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. పెళ్లి జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గానీ పిల్లలు ఉండటం లేదు. ఇందులో కొన్ని జంటలు గర్భందాల్చడం కావాలని ఆలస్యం చేస్తుంటే, ఎక్కువ మందికి మాత్రం ఎన్నో ప్రయత్నాలు చేస్తే గానీ పిల్లలు పుట్టే పరిస్థితి లేదు. అయితే టమోటాలలో ఉండే లైకోపీన్ అనే పోషకమే పురుషుల్లో వీర్యం నాణ్యతను పెంచుతుందని ఈ అధ్యయనం చెప్తోంది. పురుషులు రోజూ రెండు చెంచాల టమాట జ్యూస్‌ను తీసుకుంటే చాలు, లేదా టమాటోను నేరుగా తిన్న మంచిదే.

వారి వీర్యం నాణ్యత పెరిగి సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. పిల్లలు కూడా ఆరోగ్యంగా ఎలాంటి లోపాలు లేకుండా పుట్టే అవకాశం ఉంటుందట. పిల్లలు కలగకపోవడం ఒక సమస్య అయితే.. పుట్టుకతోనే ఏదో ఒక లోపాలతో పుట్టడం మరో సమస్య. ఇలా సంతానోత్పత్తి సమస్యలు ఉన్న పురుషులపై ఎప్పటినుంచో పరిశోధనలు జరుగుతున్నాయి. వారికి సంతానాన్ని కలగకుండా చేసే కారకాలను కనిపెట్టే ప్రయత్నాలను చేస్తున్నారు. అలాగే వారి సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచే విషయాలను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కొంటున్న పురుషులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడంతో పాటు మంచి జీవనశైలిని అనుసరించాలని చెబుతున్నారు వైద్యులు. అలాగే లోదుస్తులు బాగా బిగుతుగా ఉండేవి వేసుకోకూడదని, వదులుగా ఉండే వాటినే ధరించాలని చెబుతున్నారు. గర్భం దాల్చే అవకాశాలు పెరగాలంటే.. స్త్రీ పురుషలిద్దరూ ఒత్తిడిని తగ్గించుకొని తరచూ లైంగిక చర్యలో పాల్గొనాలని వైద్యులు చెప్తున్నారు. పురుషుల్లో సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచే ఆహారంపై కూడా విస్తృతంగా అధ్యయనం చేశారు.

అందులో విటమిన్ ఇ, జింక్ లాగే లైకోపీన్ కూడా మంచి యాంటీ యాక్సిడెంట్‌లా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా 60 మందికి లైకోపీన్ సప్లిమెంట్లను ఇచ్చి అధ్యయనం నిర్వహించారు. 12 వారాలపాటు ట్రయల్స్ జరిగాయి. ఆ తర్వాత వారి వీర్యాన్ని పరీక్షించారు. మరింత చిక్కదనం కనిపించింది, అంటే లైకోపీన్ తీసుకున్న తర్వాత వీర్యకణాలు ఆరోగ్యంగా ఎదగడంతోపాటు వాటి సంఖ్య కూడా పెరిగింది. అలాగే అవి కదిలే చలనశీలత కూడా మెరుగుపడినట్టు వారు గుర్తించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker