పరగడుపున టమాటా జ్యూస్ తాగితే కలిగే అద్భుతమైన ఫలితాలు ఏంటో తెలుసా..?
టమోటాలో సమృద్ధిగా ఉండే ఫైటో న్యూట్రియంట్లు రక్తం గడ్డకట్టకుండా కాపాడతాయి.దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. టమోటాలో సమృద్ధిగా ఉండే లైకోపీన్, విటమిన్ సి, ఇ, బీటాకెరోటిన్‌లు రక్తంలో చెడు కొలస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలస్ట్రాల్ ని పెంచి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.టమాటాల్లో ఉండే బీటా కెరోటిన్, లుటీన్, విటమిన్ సిలు కంటి సమస్యలను పోగొడతాయి.
అయితే మారుతున్న ఆహార అలవాట్లు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ రెండు ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ ను హెచ్ డీఎల్ అని చెడు కొలెస్ట్రాల్ ను ఎల్ డీఎల్ అని పిలుస్తుంటారు. మన ఆరోగ్యానికి హెచ్ డీఎల్ అవసరమే. కానీ మనం తినే ఆహారాలు మనకు నష్టం కలిగిస్తున్నాయి. దీంతో మన ఆరోగ్యం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో మనకు టమాటాలు ఎంతో ఉపయోగపడతాయి.
టమాటాల్లో విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటంతో ఇవి మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి సాయపడతాయి. దీంతో మన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో మన హృదయాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం మంచిది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.
టమాటా తినడం వల్ల రక్తంలో మలినాలను దూరం చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. ఎల్ డీఎల్ పెరగకుండా చేస్తుంది. దీని వల్ల మనకు గుండె జబ్బు, గుండెపోటు రాకుండా నిలువరించడంలో సాయపడతాయి. అందుకే టమాటాలు తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.