News

సినీ పరిశ్రమలో మరో విషాదం, స్టార్ డైరెక్టర్ కన్నుమూత.

గతకొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుని శనివారం ఇంటికి వచ్చారు. కానీ ఆ మరునాడే తుదిశ్వాస విడవడంతో విషాదం నెలకొంది. కాగా టీపీ గజేంద్రన్‌ తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్‌కు క్లోజ్‌ ఫ్రెండ్‌. 1985లో చిదంబర రహస్యం సినిమాతో నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు టీపీ గజేంద్రన్‌. 1988లో వీడు మనైవి మక్కల్‌ మూవీతో దర్శకుడిగా మారారు.

బడ్జెట్‌ పద్మనాభం, చీనా తానా, మిడిల్‌ క్లాస్‌ మాధవన్‌, బండ పరమశివం వంటి సహా తమిళంలో పలు కామెడీ చిత్రాలను తెరకెక్కించారు. అయితే గత మూడురోజుల్లోనే ముగ్గురు ప్రముఖులు మరణించడం విషాదకరం. కళాతపస్వి K విశ్వనాథ్, ప్రముఖ నిర్మాత గురుపాదం, ప్రముఖ సీనియర్ గాయని వాణి జయరాం మరణ వార్తలని జీరించుకోకముందే మరో విషాదం నెలకొంది.

తమిళ్ సినీ పరిశ్రమలో ఒకప్పటి స్టార్ డైరెక్టర్, నటుడు TP గజేంద్రన్ 68 ఏళ్ళ వయసులో నేడు ఫిబ్రవరి 5 ఉదయం మరణించారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. దీంతో తమిళ సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

పలువురు అయన ఇంటికి వెళ్లి భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా TP గజేంద్రన్ ఇంటికి వచ్చి నివాళులు అర్పించారు. సీనియర్ నటుడు ప్రభు హీరోగా అనేక సినిమాలని తెరకెక్కించారు TP గజేంద్రన్. చివరిసారిగా డైరెక్టర్ గా 2010 సినిమా తీసిన TP గజేంద్రన్ ఆ తర్వాత దర్శకత్వం చేయకపోయినా ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించారు.

దాదాపు 17 సినిమాలు డైరెక్ట్ చేసిన TP గజేంద్రన్, ఆర్టిస్ట్ గా మాత్రం దాదాపు 100 సినిమాల్లో నటించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker