ఇండస్ట్రీలో మరో విషాదం, ప్రముఖ దర్శకుడు కన్నుమూత.

ఇండస్ట్రీలో మరో విషాదం, ప్రముఖ దర్శకుడు కన్నుమూత.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం మరో కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్‌పై పోరాటంలో ముందుండి పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి సీఎం స్టాలిన్‌ ప్రత్యేక నగదు ప్రోత్సాహకం ప్రకటించారు. ‘కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయాల్లో ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్‌తో పాటుగా పోలీసులు క్షేత్ర స్థాయిలో ఉండి కరోనాపై పోరాడారు. వారి ప్రాణాలను రిస్క్‌లో పెట్టి పనిచేశారు. అయితే ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆరంభకాలంలో కథానాయకుడిగా నటించిన చిత్ర దర్శకుడు స్వర్ణం మంగళవారం చెన్నైలో కన్నుమూశారు.

ఈయన వయస్సు 88 ఏళ్లు. స్వర్ణం ప్రారంభదశలో మురసు పత్రికా సంస్థలో రచయితగా తన సేవలను అందించారు. ఆ తరువాత దర్శకుడిగా అవతారమెత్తి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ అప్పట్లో కథానాయకుడిగా నటించిన ‘ఒరేరత్తం’ చిత్రానికి దర్శకత్వం వహించారు. దీనికి మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కథ అందించడం గమనార్హం.

కాగా స్థానిక కొట్టివాక్కంలో కుటుంబ సభ్యులతో నివసిస్తున్న ఆయన.. వృద్ధాప్యం కారణంగా మంగళవారం కన్నుమూశారు. ఆయన భౌతికకాయానికి ముఖ్యమంత్రి స్టాలిన్, నటుడు, శాసనసభ్యుడు ఉదయనిధి స్టాలిన్‌ నివాళులు అర్పించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *