‘అశ్లీల వీడియోలతో డబ్బు సంపాదిస్తుంది’,స్టార్ హీరోయిన్ పై మాజీ ప్రియుడు ఆరోపణలు.
సెలబ్రిటీ జంటలు విడాకులు తీసుకొని లేదంటే అయిన తర్వాత ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం కానీ విమర్శించడం కానీ చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందని చెప్పవచ్చు.బలమైన కారణాలతో కొట్లాటలు గొడవలకు విడాకులు తీసుకొని విడిపోయిన జంటలు మాత్రమే పరస్పరం ఒక నిందించుకుంటూ కేసులు పెట్టుకుంటూ ఉంటారు.
అయితే తమిళ నటి లుబ్నా అమీర్ తన మాజీ ప్రియుడు వేధిస్తున్నాడంటూ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీస్ కమీషనర్‌ని ఆశ్రయించింది. వివరాల ప్రకారం.. ఓ డేటింగ్ యాప్ ద్వారా ఐటీ ఉద్యోగి మాసి ఉల్లాతో లుబ్నీ అమీర్‌కు పరిచయం ఏర్పడింది.
ఇద్దరూ కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్నారు. అయితే మాసిఉల్లాకు అప్పటికే పెళ్లి అయ్యిందన్న విషయం తెలిసి తాను దూరం పెట్టానని, అప్పట్నుంచి తనను వేధిస్తున్నాడంటూ లుబ్నా పేర్కొంది.
ఇదే విషయంపై అతడిపై కేసు పెడితే ఇటీవలె బెయిల్‌పై బయటకు వచ్చి హింసిస్తున్నాడని, అతనితో పాటు మాసి ఉల్లా భార్య నుంచి కూడా వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపింది. అంతేకాకుండా రిలేషన్‌లో ఉన్నప్పుడు అతనితో ఏకాంతంగా గడిపిన ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది.
అయితే మాసి ఉల్లా సైతం లుబ్నీ అమీర్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమె తన నగ్న ఫోటోలు, వీడియోలతో డబ్బు సంపాదిస్తుందని, ఇదే తమ మధ్య గొడవలకు కారణమై విడిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.