మీలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే షుగర్ పరీక్ష చేయంచుకోండి. ఎందుకంటే..?
డయాబెటిస్ అని కూడా అనబడే ఈ వ్యాధి, ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత. అతిమూత్రం (పాలీయూరియా), దాహం ఎక్కువగా వేయడం (పాలీడిప్సియా), మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం, బద్ధకం దీని ముఖ్య లక్షణాలు. అయితే చాలా మంది తమకు డయాబెటిస్ ఉందన్న విషయాన్ని త్వరగా గుర్తించలేకపోతున్నారు. దాంతో వ్యాధి ముదిరి ముప్పు పెరిగిపోతున్నది. అందుకే డయాబెటిస్‌ను ముందే గుర్తించడం చాలా మంచిది.
కాబట్టి మధుమేహం వచ్చినప్పుడు మనలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా మధుమేహం అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది. మన దేశంలోనూ డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకే పెరుగుతున్నది. అయితే కొత్తగా ఆ వ్యాధి బారిన పడుతున్న వారిలో చాలా మంది తమకు డయాబెటిస్ ఉందన్న విషయాన్ని త్వరగా గుర్తించలేకపోతున్నారు.
దాంతో వ్యాధి ముదిరి ముప్పు పెరిగిపోతున్నది. అందుకే డయాబెటిస్‌ను ముందే గుర్తించడం చాలా మంచిది. కాబట్టి మధుమేహం వచ్చినప్పుడు మనలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. డయాబెటిస్ వచ్చే ముందు మనలో కనిపించే లక్షణాలను ప్రీడయాబెటిస్ సింప్టమ్స్ అంటారు. ఈ ప్రీడయాబెటిస్ సింప్టమ్స్ రకరకాలుగా ఉంటాయి. కొందరిలో అన్ని రకాల లక్షణాలు కనిపిస్తే, మరికొందరిలో కొన్ని రకాల లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. మధుమేహం వచ్చే ముందు కొందరిలో జట్టు రాలుతుంది.
అయితే జుట్టు రాలిందంటే కచ్చితంగా మధుమేహం ఉన్నట్లు కాదు. సంబంధిత పరీక్షలు చేయించుకుంటే ఈ విషయంలో కచ్చితత్వం వస్తుంది. డయాబెటిస్ బారిన పడిన కొత్తలో కొందరిలో అలసట పెరుగుతుంది. రోజంతా అలసటగా ఉంటుంది. పని చేసినా, ఏ పని చేయకపోయినా అలసటగా అనిపిస్తుంది. మరి కొందరికి మధుమేహం సోకితే చర్మంపై మచ్చలు వస్తుంటాయి.
ఇలా చర్మంపై మచ్చలు కనిపిస్తే షుగర్ సంబంధ వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమంగా ఉంటుంది. ఇంకా కొంత మందిలో మధుమేహం బారిన పడినప్పుడు తరచూ మూత్రం వస్తుంది. మూత్రానికి వెళ్లినా కొద్ది దాహం వేస్తుంది. నీళ్లు తాగినా కొద్ది యూరిన్‌కు వెళ్లాల్సి వస్తుంది. కొంత మందిలో పై లక్షణాలతోపాటే అదనంగా తరచూ తలనొప్పి వస్తుంది. చేతులు, కాళ్లు తిమ్మిర్లు పడుతాయి.