Health

దేశంలో భారీగా తగ్గిన సంతాన ఉత్పత్తి రేటు, వెలుగులోకి సంచలన విషయాలు.

ఆధునిక జీవన విధానం వల్ల మహిళల్లో సంతానలేమి సమస్య పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణంగా చదువుకొని ఉద్యోగంలో స్థిరపడాలని, తమ రంగంలో రాణించడం కోసం రాత్రి-పగలు తేడా లేకుండా కృషి చేయాలనే కోరికతో మహిళలు సరైన వయసులో అనగా 18 నుండి 25 సంవత్సరాల వయసులో పెళ్ళి చేసుకోకపోవడం, ఫలితంగా రెండు పడవలపై కాళ్ళు పెట్టినచందంగా ఇల్లు – ఆఫీసు బాధత్యల మధ్య తీవ్రమైన మానసిక ఒత్తడికి లోవవడం వంటి సమస్యలు పుట్టుకొస్తున్నాయి.

అయితే దేశంలో సంతానోత్పత్తి వృద్ధిరేటు క్షీణిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి దీర్ఘకాలం పాటు కొనసాగితే దేశంలో యువతరం జనాభా భారీగా తగ్గి మానవ వనరుల కొరత భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావాలు చూపే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం సమాజంలో ఆర్థికపరమైన కారణాలు, చదువులు వృత్తిరీత్యా కారణాలతో లేటుగా పెళ్లిళ్లు చేసుకోవడం, ఆర్థికపరమైన కారణాలు, మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా మనుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గి సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

ఇటీవల విడుదల చేసిన నమూనా నమోదు వ్యవస్థ (SRS) డేటా 2020 ప్రకారం, భారతదేశంలో సగటు మొత్తం సంతానోత్పత్తి వృద్ధి రేటు 2008 నుండి 2010 వరకు (మూడేళ్ల వ్యవధి) 86.1గా ఉంది. 2018-20లో 68.7కి పడిపోయింది. SRS ప్రకారం డేటా, పట్టణ ప్రాంతాల్లో 15.6%తో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో 20.2% క్షీణత నమోదైంది.భారతదేశంలో సాధారణ సంతానోత్పత్తి రేటు (GFR) గత ఒక దశాబ్దంలో 20% పడిపోయింది.

GFR పునరుత్పత్తి వయస్సు 15-49 సంవత్సరాలలో ప్రతి 1,000 మంది మహిళలకు జన్మించిన పిల్లల సంఖ్యను సూచిస్తుంది. ఇటీవల విడుదలైన 2020 సాధారణ సంతానోత్పత్తి రేటు నివేదిక GFRని తగ్గించడంలో పునరుత్పత్తి వయస్సు గల మహిళల్లో అక్షరాస్యత పాత్రను ప్రముఖంగా చెప్పుకోవచ్చు.తాజా SRS నివేదిక ప్రకారం భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు రెండు శాతంగా చెప్పొచ్చు.

బీహార్ అత్యధిక TFR (3.0)ని నివేదించగా, ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అత్యల్ప TFR (1.4)ని నివేదించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ 1.5 శాతంగా నమోదయింది. ప్రస్తుత రోజుల్లో వివాహ వయసు పెరగడం, మహిళల్లో అక్షరాస్యత శాతం అత్యధికంగా ఉండడం, గర్భ నిరోధక పద్ధతులు సులువుగా అందరికీ అందుబాటులోకి రావడం వంటి కారణాలతో సాధారణ సంతానోత్పత్తి రేటులో క్షీణతకు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker