ఇలాంటి సున్నిపిండి తో స్నానం చేస్తే ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా తెల్లగా మారిపోతారు.
చిన్న పిల్లలకు నలుగు పెట్టి స్నానం చేయిస్తే చక్కటి రంగు వచ్చేవారు.. అదే పెద్దలు అయితే చర్మంపై ఉన్న మృత కణాలు అన్నీ పోయి కాంతివంతంగా చేస్తుంది. ప్రస్తుతం అందరూ సున్నిపిండిని ఉపయోగించడం మర్చిపోయారు. సబ్బు లో ఉండే హానికర రసాయనాలు వలన చర్మం పొడిబారి పోతుంది. అనేక రకాల చర్మ సంబంధ సమస్యలను తీసుకొస్తుంది.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆయుర్వేద సున్నిపిండి తయారు చేసుకుని ఉపయోగిస్తే అన్ని రకాల చర్మ సమస్యలు పోయి చర్మం తెల్లని రంగు లోకి మారుతుంది. అయితే సున్నిపిండి చర్మానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది.
చర్మాన్ని మెరిసేలా చేసే పోషకాలు దీనిలో ఉంటాయి. సున్ని పిండి తయారీకి శనగ పిండి, పెసర పిండి, బియ్యప్పిండి ఉపయోగిస్తారు. ఇవి చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేస్తాయి. వీటితోపాటు వినియోగించే పసుపు, తులసి ఆకులు, వేపాకులు యాంటీబ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న ఫంగస్, బ్యాక్టీరియాను తొలగిస్తాయి. అలాగే దీనిలోని సహజ నూనెలు చర్మానికి మాయిశ్చరైజేషన్ పెంచుతాయి. సున్నిపిండి రుద్దడం వల్ల చర్మంపై ఉన్న మురికి తొలగిపోవడంతో పాటు రక్త ప్రసరణ పెరుగుతుంది. చర్మం రంగు మెరుగవుతుంది. ముఖంపై అప్లై చేసినతరువాత శరీరం మొత్తం రుద్దుకోవటం వల్ల ముఖంపై ఉన్న చర్మం వీటి గుణాలను పీల్చుకుంటుంది.
తద్వారా చర్మం మెరుపుదనం సంతరించుకుంటుంది. సున్నిపిండిలో ఉపయోగించే గులాబీ రేకులు ట్యాన్‌ని తగ్గిస్తాయి. అలాగే చర్మం జిడ్డుగా మారకుండా నిమ్మరసం, పాలు దోహదం చేస్తాయి. సున్నిపిండిని రోజువారిగా ఉపయోగించటం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. చర్మం సున్నితంగా మారుతుంది. మచ్చల్లేని చర్మం సొంతమవుతుంది. మొటిమలు, ముడతలు తగ్గి చర్మం యవ్వనంగా కాంతివంతంగా కనిపిస్తుంది. స్క్రబ్‌లా పనిచేయడం వల్ల చర్మంపై ఉన్న సన్నని వెంట్రుకలు కూడా తొలగిపోతాయి.
సున్ని పిండి తయారీకి కావాల్సిన పదార్ధాలు ; సున్నిపిండి తయారు చేయటానికి ముందుగా కొన్ని పదార్ధాలను సేకరించుకోవాలి. అవేంటంటే.. పెసర పిండి – పావుకేజీ, ఉలవల పిండి – పావు కేజీ, శనగ పిండి – పావు కేజీ, ముల్తానీ మట్టి – పావుకేజీ, పసుపు – 50 గ్రా, గులాబీ రెక్కల పొడి – 50 గ్రా, నారింజ తొక్కల పొడి – 50 గ్రా, వేపాకుల పొడి – 50 గ్రా, తులసి పొడి – 50 గ్రా,మెంతి ఆకుల పొడి – 50 గ్రా,బియ్యం పిండి – 50 గ్రా. గోధుమ పిండి – 50 గ్రా. బాదం పప్పులు – నాలుగు. తయారీ విధానం.. ముందుగా పప్పులన్నింటినీ ఎండలో ఎండబెట్టి ఎండిన తరువాత వాటిని పొడిగా మార్చుకోవాలి. ఆ తర్వాత మెత్తని పిండిలా చేసి వాటన్నింటినీ కలగలుపుకోవాలి.
వీటన్నింటికీ కలిపి జల్లించాలి. ఇలా జల్లించగా వచ్చిన మెత్తని పొడిని పక్కన పెట్టుకోవాలి. వేపాకులను నీడలో ఆరబెట్టుకొని.. బాగా ఎండిపోయిన తర్వాత మెత్తగా చేసుకోవాలి. వీటిని కూడా జల్లెడ పట్టుకోవాలి. ఆపై ఈ పొడులన్నింటినీ కలుపుకోవాలి. తర్వాత ఓ గాజు సీసాలో వీటన్నింటినీ కలిపి పెట్టుకోవాలి. దీన్ని రోజూ కొద్దిగా తీసుకొని స్నానానికి వాడుకోవాలి.