Health

ఈ ఎండలకి బీరు తాగుతున్నారా..? ఎంత మంచిదో తెలుసుకోండి.

ఎక్కువగా తాగడం వల్ల ఎసోఫాగియల్ క్యాన్సర్, సిర్రోసిస్, ఇతర తీవ్రమైన అనారోగ్యాలు ఎదురవుతాయి. కానీ మితంగా తీసుకుంటే మద్యపానం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అసలు మద్యం ముట్టనివారికంటే పరిమితంగా బీరు, సాధారణ ఆల్కహాల్ తీసుకునేవారే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. అయితే మధ్యస్థంగా బీర్ తాగేవారికి కరోనరీ ఆర్టరీ వంటి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 20 నుంచి 40% తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బీరులో ఉండే హాప్స్ యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను ఆక్సిడేషన్ నుంచి కాపాడుతాయి.

ఇవి అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బీరులో ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బీరులో శాంటోహుమోల్ అనే ప్రీనిలేటెడ్ పదార్థం ఉంటుంది. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఇన్‌ఫెక్షియస్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల బీరు శరీర భాగాల్లో వాపును తగ్గించేందుకు కృషి చేస్తుంది. తరచుగా బీరు తాగేవారికి గ్యాంగ్రేన్ వంటి అనారోగ్యాల ప్రమాదం తగ్గుతుంది. సిలికాన్, విటమిన్ బి, బయోయాక్టివ్ పాలీఫెనాల్స్ వంటివన్నీ బీరులో ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తాయి.

బీరులో ఫైబర్, లిపోప్రొటీన్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఫలితంగా తరచుగా బీరు తాగేవారిలో ధమనుల ఆరోగ్యం బాగుంటుంది. ఇతర హార్డ్ డ్రింక్స్‌తో పోలిస్తే, బీర్‌లో ఆల్కహాల్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. బీరులో నాలుగు నుంచి ఆరు శాతం ఆల్కహాల్ మాత్రమే ఉంటుంది. అయితే ఇది బ్రాండ్‌ని బట్టి మారుతుంది. దీంతోపాటు బీరులో అతి తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఫలితంగా ఆరోగ్యంపై దుష్ప్రభావం పెద్దగా ఉండదు. ఒక పింట్ బీర్‌లో సుమారు 208 క్యాలరీలు ఉంటయాని అంచనా. అతిగా మద్యం తాగితే హ్యాంగోవర్ అవుతుంది.

సాధారణంగా విస్కీ, బ్రాందీ వంటి హార్డ్ డ్రింక్‌తో ఎక్కువ మందికి హ్యాంగోవర్ అవుతుంది. వీటితో పోలిస్తే అదే మొత్తంలో బీర్ తాగడం వల్ల తక్కువ డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఫలితంగా హ్యాంగోవర్ వచ్చే అవకాశాలు తక్కువ అవుతాయి. అలాగని అతిగా బీరు తాగినా ప్రమాదమే. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. బీర్లలో ఉండే శాంటోహుమోల్ అనే ఫ్లేవనాయిడ్లకు క్యాన్సర్‌కు కారణమయ్యే ఎంజైమ్‌లను నిరోధించే శక్తి ఉంటుంది. ఈ శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌ ఇతర అనారోగ్యాలను సైతం దూరం చేస్తుంది. కిడ్నీలలో ఏర్పడే రాళ్లను విచ్ఛిన్నం చేయడానికి బీరు తోడ్పడుతుంది.

ఈ వ్యర్థాలను మూత్రంతో పాటు బయటకు పంపేందుకు బీరు సాయం చేస్తుంది. అయితే మెడికల్ ట్రీట్‌మెంట్‌కు ఈ పద్ధతి ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలి. మితమైన మద్యపానానికి బీరు అనువైనది. ఎందుకంటే ఇందులో ఆల్కహాల్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో పాటు వైన్ లేదా స్పిరిట్స్ వంటి డ్రింక్స్ కంటే ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. కాబట్టి దీనివల్ల పెద్దగా అనర్థాలు ఉండవు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker