News

నిత్య జీవితంలో సుహాస్ పడిన కష్టాలు తెలిస్తే కన్నీళ్లు వస్తాయి.

సుహాస్, చాందిని చౌదరి జంటగా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ‘కలర్ ఫోటో’.. ఇటీవలే ‘ఆహా’ ద్వారా విడుదలైన ఈ సినిమాకు ఏ స్థాయి స్పందన వస్తుందో తెలిసిందే. సినిమా చూసిన వారంతా సుహాస్ నేచురల్ పెర్ఫార్మెన్స్‌ని పొగుడుతున్నారు. సెలబ్రిటీలు స్వయంగా పిలిచి మరీ అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు సుహాస్. ఇంట్లో జాబ్ అని అబద్ధం చెప్పి నంద్యాల వెళ్లి.. అక్కడినుండి రెండు రోజులకొకసారి హైదరాబాద్ వచ్చి అవకాశాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవాడట.

అయితే ప్రయత్నిస్తున్న రోజుల్లో సుహాస్ కి ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ‘చాయ్ బిస్కట్’ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు..వాటిల్లో ‘ది అతిథి’ అనే షార్ట్ ఫిలిం పెద్ద హిట్ అయ్యింది,దీనితో సుహాస్ తాను కోరుకున్న ఫేమ్ అయితే బాగా దక్కింది, ఆ తర్వాత అదే ‘చాయ్ బిస్కట్’ ఛానల్ లో ‘కళాకారుడు’ అనే షార్ట్ ఫిలిం చేసాడు, ఇది కూడా బాగా క్లిక్ అయ్యింది.ఈ రెండు షార్ట్ ఫిలిమ్స్ బాగా హిట్ అవ్వడం తో సుహాస్ డైరెక్టర్స్ దృష్టిలో పడ్డాడు.ఇతనిలో మంచి కామిక్ టైమింగ్ ఉందని గమనించిన ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి తాను శర్వానంద్ తో తీసిన ‘పడి పడి లేచేమనసు’ అనే చిత్రం లో ముఖ్యమైన పాత్ర ఇచ్చాడు.

సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా ఆయనకి మంచి పేరైతే వచ్చింది..అలా ఒక పక్క షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూనే మరోపక్క సినిమాల్లో తనకి వచ్చిన అవకాశాలను వదులుకోకుండా రెండిటిని బ్యాలన్స్ చేస్తూ వచ్చాడు. అలా రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్న సుహాస్ కి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’.ఈ సినిమాలో డిటెక్టివ్ గా చాలా చక్కగా నటించాడు సుహాస్..ఆయన క్యారక్టర్ కూడా బాగా క్లిక్ అయ్యింది.

ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ సుహాస్ గురుంచి ప్రత్యేకంగా ‘సుహాస్ మేక్స్ యాన్ ఇంప్రెసివ్ కామియో యాజ్ డిటెక్టివ్ బాబీ’ అని ఒక ఆర్టికల్ ప్రచురించింది అంటేనే అర్థం చేసుకోవచ్చు సుహాస్ ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..ఇక ఆ తర్వాత నాగ చైతన్య హీరో గా నటించిన మజిలీ చిత్రం తర్వాత ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు..ఈ సినిమా బాగా హిట్ అవ్వడం తో సుహాస్ ని అందరూ ‘మజిలీ సుహాస్’ అని పిలవడం ప్రారంభించారు. ఇక అక్కడి నుండి సుహాస్ సినీ కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోయింది.

ఇప్పుడు అతగాడు ఏ స్థానం లో ఉన్నాడో మనం చూస్తూనే ఉన్నాము..సుహాస్ కి ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న డిమాండ్ ప్రకారం ఆయన ఒక్క రోజు కాల్ షీట్ రెండు లక్షల రూపాయలతో సమానం అని చెప్పొచ్చు..అదే హీరో గా అయితే 50 లక్షల రూపాయిల వరకు డిమాండ్ చేసే రేంజ్ కి ఎదిగాడట, ఇప్పుడు రీసెంట్ గా విడుదలైన ‘రైటర్ పద్మభూషణ్’ కూడా పెద్ద హిట్ అవ్వడం తో ఆయన రేంజ్ మరింత పెరిగింది..ఇలాగే విభిన్నమైన పాత్రలతో ముందుకు పోతే సుహాస్ కి కచ్చితంగా ఒక బ్రాండ్ ఇమేజి ఏర్పడుతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.చూడాలి మరి ఆయన రేంజ్ ఎలా మారబోతుందో అనేది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker