చిన్న వయస్సులోనే దంగల్ నటి మృతి, చనిపోవడానికి కారణం ఏంటంటే..?
20 ఏళ్లు కూడా నిండకుండానే కన్నుమూసిన సుహానీ మరణవార్త పట్ల పలువురు సెలబ్రెటీలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ‘దంగల్’లో రెజ్లర్ గా ఆమె కనబర్చిన ప్రతిభకు ఇండియా మొత్తం ఫిదా అయ్యింది. అయితే సుహానీ భట్నాగర్ మృతికి మొదట అందరూ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ గా భావించారు. ఆమెకు కాలు విరిగినప్పుడు వాడిన మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆమె మరిణించి అంటూ చెప్పుకొచ్చారు.
కానీ, సుహానీ కుటుంబం ఆ వాదనను కొట్టిపారేశారు. వారి కుమార్తె మృతికి అరుదైన వ్యాధి కారణం అంటూ చెప్పుకొచ్చారు. అరుదైన ఇన్ఫ్లమేటరీ వ్యాధితో పోరాడుతూ సుహానీ భట్నాగర మృతి చెందిన విషయాన్ని తెలియజేశారు. కండరాల బలహీనతకు కారణమయ్యే ఇన్ఫ్లమేటరీ వ్యాధిగా చెప్పే డెర్మాటోమయోసిటిస్ వ్యాధితో పోరాడుతూ తుదిశ్వాస విడిచిందని వెల్లడించారు. ఆమెను ఫిబ్రవరి 7న ఈ వ్యాధి కారణంగానే ఎయిమ్స్ లో చేర్పించినట్లు తెలిపారు.
ఆ వ్యాధికి చికిత్స పొందుతూ అది విషమించడంతోనే సుహానీ ప్రాణాలు కోల్పోయిందని తెలియజేశారు. సుహానీలో కనిపించాయి. ఒంటిపై ఎర్రటి మచ్చలు రావడంతో ఎన్నో ఆస్పత్రులకు తిప్పారు. కానీ, ఎవ్వరూ ఈ వ్యాధి ఏంటి అనేది నిర్ధారణ చేయలేకపోయారు. ఇటీవల ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఎయిమ్స్ లో చేర్పించారు. కేవలం పదిరోజుల క్రితమే సుహానీకి ఈ ఇన్ఫ్లమేటరీ డెర్టాటోమయోసిటిస్ వ్యాధి నిర్ధారణ జరిగింది.
ఆమె ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి లేకపోగా.. మరింత క్షీణించింది. ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువయ్యి ద్రవాలు ఊపిరితిత్తుల్లోకి చేరుకుని లంగ్స్ కూడా దెబ్బతిన్నాయి. వైద్యులు ఆమెను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. కానీ, ఎలాంటి ఫలితం లేకుండా పోయిందంటూ సుహానీ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అరుదైన వ్యాధితో పోరాడుతున్న వాళ్లు ప్రపంచవ్యాప్తంగా కేవలం ఐదు నుంచి ఆరుగురు మాత్రమే ఉన్నారని వారు తెలిపారు.