షుగర్ ఉన్నవారు వీటిని గుర్తుపెట్టుకొని మరి తినాలి. ఎందుకంటే..?
పల్లీల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్ హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తాయి. అంతేకాదు శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. మెదడు చురుకుగా పనిచేస్తుంది. గర్భిణులు నిత్యం పల్లీలు తీసుకుంటే అవసరమైన పోషకాలు అందుతాయని వైద్యులు చెబుతున్నారు. అయితే షుగర్ తో బాధపడే వాళ్ళు ఒకటి నుండి 50, 55 వరకు గ్లైసీమిక్ ఇండెక్స్ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవచ్చు.
దాని వలన షుగర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి నష్టం కూడా కలగదు. కానీ ఈ లిమిట్ దాటినటువంటి ఫుడ్ ని తీసుకుంటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 56 నుంచి 69 వరకు గ్లైసీమిక్ ఇండెక్స్ ఉండే ఆహార పదార్థాలను షుగర్ పేషెంట్లు తీసుకోకూడదు. ఇలాంటివి తగ్గించడం మంచిది. దాని కంటే ఎక్కువ ఉండే వాటిని అస్సలు తీసుకోకుండా ఉండడమే మంచిది.
అయితే షుగర్ తో బాధపడే వాళ్ళు, గ్లైసీమిక్ ఇండెక్స్ ని చూసి దాని ప్రకారం ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. వేరుశనగలను తీసుకుంటే, అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకే సారి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోకుండా ఉంటాయి. చాలా మంది షుగర్ తో బాధపడే వాళ్ళు, పల్లీలు తీసుకోవచ్చా లేదా అని అడుగుతూ ఉంటారు.
అయితే పల్లీలను తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదం ఉండదు. షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఎటువంటి నష్టం ఉండదు. అలానే నీళ్లతో షుగర్ ని తగ్గించుకోవచ్చా లేదా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. డయాబెటిస్ మొత్తం నీటితో తగ్గదు. కానీ బాగా ఎక్కువగా డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు కొంత వరకు తగ్గించుకోవచ్చు.
గ్లూకోస్ లెవెల్స్ అయితే తగ్గిపోవు. కానీ బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. డయాబెటిస్ తో బాధపడే వాళ్ళకి ఎక్కువ అలసట ఉంటుంది. ఇది తగ్గాలంటే నీళ్ళని బాగా తీసుకుంటూ ఉండాలి. దానితో పాటుగా కొంచెం సేపు వ్యాయామం చేయాలి. రోజులో ఒక గంట సేపు వ్యాయామానికికి మీ సమయాన్ని వెచ్చిస్తే, ఆరోగ్యం బాగుంటుంది.