Health

డయాబెటీస్‌ ఉన్నవారు వేరుశెనగలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

వేయించిన వేరుశెనగల్లో కేలరీలు అధికంగా వుంటాయి. ఉడికించిన వేరుశెనగల్లో ఫైబర్ అధికంగా వుంటుంది. ఇది మధుమేహం వ్యాధిగ్రస్థులకు మేలు చేస్తుంది. ఉడికిన వేరుశెనగల్లో ఫ్లేవనాయిడ్స్, పాలిఫెనాల్స్, యాంటీ యాక్సిడెంట్స్ అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వవు. ఇంకా క్యాన్సర్‌ కణాలపై పోరాడుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఆహారం విషయంలో డయాబెటిస్ రోగులకు ఎప్పుడూ సందేహాలుంటాయి.

ఎలాంటి ఆహారం తినవచ్చు, ఎలాంటి ఆహారం తినకూడదనే ప్రశ్నలు వారిని వేధిస్తుంటాయి. ఎందుకంటే ఏ మాత్రం పొరపాటైనా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. మధుమేహంలో కిడ్నీ డిసీజ్, హార్ట్ డిసీజ్, కంటి వెలుగు తగ్గడం వంటి ప్రమాదాలుంటాయి. ఆహారం విషయంలో డయాబెటిస్ రోగులకు ఎప్పుడూ సందేహాలుంటాయి. ఎలాంటి ఆహారం తినవచ్చు, ఎలాంటి ఆహారం తినకూడదనే ప్రశ్నలు వారిని వేధిస్తుంటాయి.

ఎందుకంటే ఏ మాత్రం పొరపాటైనా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. మధుమేహంలో కిడ్నీ డిసీజ్, హార్ట్ డిసీజ్, కంటి వెలుగు తగ్గడం వంటి ప్రమాదాలుంటాయి. అధిక బరువుకు చెక్.. డయాబెటిస్ రోగులకు స్థూలకాయం అతిపెద్ద సమస్యగా ఉంటుంది. వేరు శెనగ తినడం వల్ల వారు అధిక బరువు నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీరానికి హెల్తీ ఫ్యాట్.. వేరుశెనగను పేదల బాదంగా చెప్పవచ్చు. హెల్తీ ఫ్యాట్‌కు రిచ్ సోర్స్ ఇది. ఇది తినడం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

మధుమేహ వ్యాధిగ్రస్థులు వేరుశెనగ తినవచ్చా బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం ఉదయం వేళ వేరుశెనగ తింటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. పీనట్ బటర్‌లో మెగ్నీషియం మధుమేహానికి ఉపయోగకరం. కొలెస్ట్రాల్‌కు చెక్.. వేరుశెనగ తినడం వల్ల రక్త నాళికల్లో పేరుకున్న కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

ఎందుకంటే ఇందులో ఫైబర్, ప్రోటీన్లు, మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. డయాబెటిస్ రోగులకు గుండె వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే వేరుశెనగ తినాల్సి ఉంటుంది. వేరుశెనగలో ఉండే న్యూట్రియంట్లు వేరుశెనగను అత్యంత పౌష్టికాహారంగా చెప్పవచ్చు. ఇవి తినడం వల్ల శరీరానికి ప్రోటీన్లు, విటమిన్ బి6, విటమిన్ బి9, విటమిన్ బి కాంప్లెక్స్, ప్యాంటోథెనిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker