మధుమేహం ఉన్నవారి కాళ్లకు పుళ్లు పడితే సహాజంగా తగ్గించే చిట్కాలు.
శారీరక శ్రమ తగ్గిపోయి, మానసిక ఒత్తిడి పెరిగిపోతూ అధిక బరువుకి దారితీస్తున్నది. టీవీలు, సెల్ ఫోన్లు సన్నబడుతున్నాయి. మనుషులు లావు అవుతున్నారు. లావు కావడమే షుగర్ వ్యాధి పెరగడానికి ప్రధాన కారణం అయింది. అయితే మధుమేహ బాధితులు రోజూ వారీ పనుల్ని కూడా సక్రమంగా, సమర్థంగా చేసుకోలేక ఇబ్బంది పడతారు. కాళ్ల భాగాలు దెబ్బ తిని పరిస్ధితి విషమంగా మారే ప్రమాదం ఉంటుంది.
ఫుట్ అల్సర్‌ను ప్రారంభంలోనే గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. మధుమేహ ఫుట్ అల్సర్‌తో ఇబ్బంది పడేవారు కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. మధుమేహుల్లో కాళ్ల గాయాలను తగ్గించే చిట్కాలు.. కలబంద..చర్మ గాయాల్ని నయం చేయడంలో కలబంద చక్కగా పని చేస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు డయాబెటిక్ ఫుట్ అల్సర్‌కి చికిత్సగా పని చేస్తుంది. ఇందులోని సహజ గుణాలు.. పాదాలకు చల్లదనాన్ని కూడా అందిస్తాయి.
మృదువుగానూ చేస్తాయి. మీరు మీ రోగ నిరోధక శక్తిని, ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవడానికి ఒక కప్పు కలబంద గుజ్జును సైతం తీసుకోవచ్చు. దీని వల్ల త్వరగా గాయాలు తగ్గిపోతాయి. అవిసెగింజల నూనె.. అవిసె గింజల నూనె మదుమేహుల్లో ఏర్పడే ఫుట్ అల్సర్‌ను తగ్గించుకోవడానికి సహాయ పడతాయి. ఈ నూనెలో ఒమేగా 2 ఫ్యాటీ యాసిడ్లు ఉండటం వల్ల డ్యామేజీ అయిన బ్లడ్ వెజెల్స్‌ను బాగు చేస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. వాస్కులర్ హెల్త్‌ను అవిసె గింజల నూనె మెరుగుపరుస్తుంది.
పాదాలకు ఈ నూనెను రాయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. అయోడిన్.. మధుమేహంతో బాధపడుతున్న వారు ఇన్సులిన్ పెరుగుతుందనే భయంతో అయోడిన్ తక్కువ మోతాదు తీసుకుంటారు. వాస్తవానికి మన శరీరానికి అయోడిన్ కచ్చితంగా అవసరం ఉంటుంది. ఫుట్ అల్సర్‌ను తగ్గించడంలో అయోడిన్ కీలక పాత్ర పోషిస్తుంది. కాళ్ల పుళ్లు, మంటలు తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మధుమేహం ఉన్న వారు కాస్త అయోడిన్‌ను డైట్లో చేర్చుకోవడం ముఖ్యం.
దీని వల్ల సమస్య చాలా వరకూ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. జింక్.. ఫుట్ అల్సర్‌ను నయం చేయడంలో జింక్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. గుడ్లు, నట్స్, లిగమెంట్స్‌లో జింక్ పుష్కలంగా ఉంటుంది. వీటిని మధుమేహం ఉన్న వారు తీసుకోవడం వల్ల ఫుట్ అల్సర్‌ను దూరం చేసుకోవచ్చు. జింక్ వల్ల శరీరంలో షుగర్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. అంతేకాదు జింక్ వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి. కాబట్టి వీటిని మీ డైట్లో చేర్చుకోండి.