షుగర్ ఉన్నవారి కాలికి పుండ్లు పడితే వెంటనే ఏం చెయ్యాలంటే..?
మధుమేహం వ్యాధి స్త్రీ పురుషులెవరికైనా, ఏ వయసు వారికైనా రావచ్చు. ఈ వ్యాధినే డయాబెటీస్ అని షుగర్ వ్యాధి అని కూడా పిలుస్తారు. రక్త ప్రసరణలో చక్కెర శాతం ఎక్కువ అవడాన్ని బట్టి ఈ వ్యాధిని గుర్తించవచ్చు. ముఖ్యంగా షుగర్ వ్యాధిని టైపు1 టైపు 2 అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఇంకా చిన్నపిల్లలు, గర్భిణీలకు వచ్చే షుగర్ వ్యాధి, ప్రీ డయాబెటీస్ అనే మరో మూడు రకాలుగా కూడా ఈ వ్యాధిని వర్గీకరించారు.
ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసేందుకు వైద్య నిపుణులు తమ పరిశోధనల ద్వారా కృషి చేస్తున్నారు. అయితే మీకు వంట ఇంట్లో అందుబాటులో ఉండే పలు పదార్థాలతో డయాబెటిక్ ఫుట్ అల్సర్‌ను తగ్గించుకోవచ్చు. దాంతో పాటు మీ జీవన శైలిని కూడా ఆరోగ్యకరంగా మార్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఆహార నియమాలు పాటిస్తే ఇంకా మేలు జరుగుతుంది. మధుమేహంతో బాధపడుతున్న చాలా మంది ఇన్సులిన్ పెరుగుతుందనే భయంతో అయోడిన్ తీసుకోవడం తగ్గిస్తుంటారు. కానీ నిజానికి.. మన శరీరానికి కాస్త అయోడిన్ కచ్చితంగా అవసరం ఉంది.
అంతేకాదు ఫుట్ అల్సర్‌ను తగ్గించడంలోనూ అయోడిన్ కీలక పాత్ర పోషిస్తుంది. కాళ్ల పుళ్లు, మంటలు తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మధుమేహం ఉన్న వారు కాస్త అయోడిన్‌ను డైట్‌లో చేర్చుకోవడం ముఖ్యం. దీని వల్ల సమస్య చాలా వరకూ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీర వ్యవస్థ పనితీరు సక్రమంగా జరిగేందుకు విటమిన్ ఇ ఎంతో ముఖ్యం. ఫుట్ అల్సర్‌ను తగ్గించడంలోనూ విటమిన్ ఇ అద్భుతంగా పని చేస్తుంది. విటమిన్ ఇ అనేది హీలింగ్ ప్రాసెస్‌ను వేగవంతం చేస్తుంది.
ఇది శరీరంలో రక్త ప్రసరణను కూడా మెరుగు పరుస్తుంది. రక్తం, ఆక్సిజన్ సరైన తీరులో ప్రసరణ జరిగినప్పుడే కాళ్ల ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. చర్మ గాయాల్ని నయం చేయడంలో కలబంద చక్కగా పని చేస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు డయాబెటిక్ ఫుట్ అల్సర్‌కి చికిత్సగా పని చేస్తుంది. ఇందులోని సహజ గుణాలు.. పాదాలకు చల్లదనాన్ని కూడా అందిస్తాయి. మృదువుగానూ చేస్తాయి. మీరు మీ రోగ నిరోధక శక్తిని, ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవడానికి ఒక కప్పు కలబంద గుజ్జును సైతం తీసుకోవచ్చు. దీని వల్ల త్వరగా గాయాలు మానిపోతాయి. కాబట్టి ఇది కూడా మీరు వాడొచ్చు.