డయాబెటీస్ ఉన్నవారికి బీపీ సమస్యలు ఖచ్చితంగా వస్తాయా..?
డయాబెటిస్ ఉన్నవారు వారి రక్తపోటు స్థాయిని కంట్రోల్ లో ఉంచేందుకు వీలైనంతగా ప్రయత్నాలు చేయాలి. మీ జీవనశైలిలో చిన్న మార్పులు చేయడం… మీ రక్తపోటును మెయింటెన్ చేయడంలో మరియు మీ జీవితం, ఆరోగ్యాన్ని నియంత్రించడంలో చాలా దూరం వెళుతుంది. అయితే డయాబెటిస్ ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఈ సమస్యతో బాధపడే వారిలో మూడింట రెండు వంతుల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
అధిక రక్తపోటుకు, మధుమేహానికి మధ్య బలమైన సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నాయి. ఇన్సులిన్ నిరోధకత, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడం వల్ల రక్తపోటు అమాంతం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు గుండె జబ్బులు, స్ట్రోక్, ఇతర సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే ఈ రెండింటినీ జీవనశైలిలో మార్పులు, మందుల ద్వారా నియంత్రించవచ్చు. ఇన్సులిన్ అనేది క్లోమంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్. ఇది మీ బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారు తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయరు. లేదా వారి కణాలు ఇన్సులిన్ కు సరిగ్గా స్పందించవు. టైప్ 1 డయాబెటిస్ ఏం చేసినా.. పూర్తిగా నయం కాదు. కేవలం నియంత్రణలో ఉంచుకోగలరంతే. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కొన్ని పద్దతులను పాటించాల్సి ఉంటుంది. ఇన్సులిన్ నిరోధకత నైట్రిక్ ఆక్సైడ్ ఉపయోగించే శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ తో రక్తపోటును తగ్గించే శరీర సహజ మార్గం దెబ్బతిన్నప్పుడు రక్త నాళాలు వాటి స్థితిస్థాపకతను కోల్పోతాయి.
రక్తం, ఆక్సిజన్ ప్రవాహాన్ని నియంత్రించడం ప్రారంభిస్తాయి. కాలక్రమేణా ఇది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. డయాబెటిక్ నెఫ్రోపతి లేదా మూత్రపిండాల వ్యాధి డయాబెటిస్ ఉన్నవారిలో ఇవి సాధారణంగా కనిపిస్తాయి. టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారికి, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణ లేని వారికి మూత్రపిండాల వైఫల్యం సమస్య వచ్చే ప్రమాదం ఉంది. మూత్రపిండాలలో మిలియన్ల చిన్న నెఫ్రాన్లు ఉంటాయి. ఇవి రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. మలినాలను తొలగిస్తాయి.
దీనివల్ల ఫ్యూచర్ లో రక్తంలో చక్కెర పెరగడం వల్ల మూత్రపిండాలు, నెఫ్రాన్లలో రక్త నాళాలు దెబ్బతింటాయి. ఇది మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. 18 ఏళ్లు పైబడిన వారిలో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. డయాబెటిస్ ఉన్న ప్రతి నలుగురిలో ముగ్గురికి రక్తపోటు సమస్య ఉంది. మధుమేహం, ఊబకాయం ఉన్నవారికి తరచుగా రక్తపోటు పెరిగిపోతూ ఉంటుంది. మెటబాలిక్ సిండ్రోమ్ సమస్య కూడా వస్తుంది. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నవారికి హృదయ సంబంధ వ్యాధులు, ఇతర తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులు వచ్చే ప్రమాదం కూడా ఉంది.