News

కమెడియన్ సుధాకర్ చనిపోయారంటూ వార్తలు, ఆ వార్తలపై సుధాకర్ వీడియో సందేశం.

కమెడియన్ సుధాకర్ మృతి చెందారంటూ రూమర్స్ వస్తున్నాయి. ఆయన కన్నుమూశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పలు చిన్న వెబ్​సైట్లు కూడా ఆయన మరణించారని న్యూస్ రాశాయి. అయితే ఇది ఫేక్ అని తేలింది. సుధాకర్ ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టమైంది. దీంతో సుధాకర్​పై ఇలాంటి నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్న వారి మీద ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ఇష్టం వచ్చినట్లు పుకార్లు పుట్టించడం సరికాదని ఫైర్ అవుతున్నారు. అయితే నిజానికి సుధాకర్ ఆరోగ్యం గురించి ఇలాంటి రూమర్స్ రావడం ఇదే ఫస్ట్ టైమ్ ఏమీ కాదు. 2010లో ఆయన తీవ్ర అనారోగ్యం కారణంగా కోమాలోకి వెళ్లారు. ఆ సమయంలోనే సుధాకర్ ఇక లేరని ఫేక్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సమయంలోనే సుధాకర్ ఇక లేరని ఫేక్ వార్తలు పుట్టించారు.

అయితే వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో, 2015 సంవత్సరంలో తిరిగి కోలుకున్నారు. ఆ తర్వాత కూడా తాను సినిమాల్లో నటించబోతున్నట్టు ప్రకటించారు కానీ.. పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం సుధాకర్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు చిరంజీవి, సుధాకర్ రూమ్మేట్స్ గా ఉండేవారు.

భారతీరాజా తెరకెక్కించిన ‘కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్’ అనే సినిమాతో సుధాకర్ బేతా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత హీరోగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా తెలుగు తమిళ భాషల్లో దాదాపు 400 సినిమాలలో నటించారు. పాత తరం హీరోల దగ్గర నుంచి ఇప్పటి స్టార్ హీరోల వరకూ, అందరికీ స్నేహితుడుగా నటించడం సుధాకర్ కే చెల్లింది.

నటుడిగానే కాకుండా నిర్మాతగానూ మారారు. చిరంజీవితో కలిసి ‘యముడికి మొగుడు’ వంటి సూపర్ హిట్ సినిమాను నిర్మించారు. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. ప్రస్తుతం పూర్తిగా విశ్రాంత జీవితం గడుపుతున్నారు. సుధాకర్ చివరగా ‘ఇ ఈ’ అనే చిత్రంలో కనిపించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker