Health

హోం రెమిడీస్ తో కాకుండా ఎలా చేస్తే స్ట్రెచ్ మార్క్స్ వెంటనే తొలగిపోతాయి.

పురుషుల్లోనూ స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి కానీ ఈ విషయాన్ని ఎవరూ సీరియస్ గా పట్టించుకోరు. టీనేజర్లలో స్ట్రెచ్ మార్క్స్ ఉంటే వారు చాలా ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతారు. మొండిగా ఉన్న ఈ మరకలు పోగొట్టాలంటే మీకు కాసింత ఓపిక ఉండాల్సిందే.. తీరిక చేసుకోవాల్సిందే. అయితే మహిళల శరీరంపై కొన్ని భాగాల్లో చారలు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఈ సమస్య ఎక్కువ. చర్మం చాలా మార్పులకు గురవుతుంది. అధికబరువు, లేదా బరువు తగ్గడం వల్ల ఏర్పడుతుంటాయి.

ఫ్యాట్ కణాలు ఎక్కడ చేరుతాయో అక్కడ స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి. వీటిని వీలైనంత త్వరగా తొలగించుకోవడం మంచిది. గర్భిణీ స్త్రీలకే కాదు..ఎక్సర్‌సైజులు చేసేవారికి కూడా చర్మం బాగా సాగి చారలు ఏర్పడుతుంటాయి.అవి కొంతకాలానికి రోజూవారీ పనులు చేసుకుంటూ, ఆహారంలో కొవ్వు తక్కువగా ఉండేట్టు చూసుకుంటూ.. బరువు తగ్గితే నెమ్మదిగా చర్మంలో కలిసిపోతాయి. కానీ కొంతమందిలో మాత్రం అలాగే ఉండిపోతాయి.మరి అటువంటి వారు కూడా ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ ను సులభంగా పోగొట్టవచ్చు.

లేజర్ థెరపీతో స్ట్రెచ్ మార్క్స్ మాయం.. స్ట్రెచ్ మార్కులను చాలా త్వరగా మాయం చేసే ట్రీట్మెంట్ లేజర్ థెరపీ అని న్యూయార్క్ లోని చర్మవ్యాధి నిపుణుడు ‘బ్రూస్ కాట్జ్’ తెలిపారు. లేజర్ లైటింగ్ రక్తంలోని హిమోగ్లోబిన్ ని తీసేస్తుంది.. దీనివల్ల చెర్మంపై చారలు, ఎరుపు కనిపించవు. ఇందుకు CO2 లేజర్‌ కట్టర్ ద్వారా చర్మానికి మైక్రో రంధ్రాలు పెట్టి ట్రీట్మెంట్ చేస్తారు. ఇది పనిచేయడానికి కనీసం మూడు, నాలుగు చికిత్సిలు అవసరం అవుతాయి. దీంతో డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి, బ్లడ్ సర్క్యులేషన్ ను నివారిస్తుంది.

అలా మెల్లగా స్ట్రెచ్ మార్క్స్ మాయం అవుతాయని నిపుణులు తెలిపారు. నేచురల్ హోం రెమెడీస్ తో ప్రయోజనం లేదంటున్న నిపుణులు.. ఒక్కసారి స్రెచ్ మార్క్స్ వచ్చాయంటే వాటిని తొలగించడం చాలా కష్టం. వాటిని కనిపించకుండా చేయడం కోసం నానా తంటాలు పడుతుంటారు. అందుకు నేచురల్ హోం రెమెడీస్ అంటూ ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, పంచదార, అలోవెర జెల్, బంగాళాదుంప జ్యూస్, గుడ్డు లాంటి రకరకాల పదార్ధాలను చర్మంపై ప్రయత్నిస్తుంటారు.

కానీ మీరు అనుకున్నట్టు అలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. పూర్తిగా తొలగిపోవాలంటే ట్రీట్మెంట్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. వీటికి మార్కెట్లో దొరికే క్రీమ్స్, ఇంటి చిట్కాల బదులు లేజర్ థెరపీ చేయించుచుంటే సమస్య త్వరగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.కచ్చితంగా సమస్య తగ్గుతుంది. ఇక ఆలస్యం చేయకండి వెంటనే లేజర్ థెరపీ ఉపయోగించి మీ సమస్యను తగ్గించుకోండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker