ఈ రాయి పై మీ బండి నెంబర్ రాస్తే చాలు, జీవితంలో మీ బండికి ప్రమాదం జరగదు.
రోడ్డు ప్రమాదాలు అతివేగం, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కారణంగానే చోటు చేసుకున్నట్లు నివేదికలో వెల్లడైంది. మొత్తం ప్రమాదాల్లో 71.2 శాతం మరణాలు అతివేగం వల్లే చోటు చేసుకున్నాయి. రాంగ్ సైడ్‌లో ప్రయాణం వల్ల 5.4 శాతం మంది మరణించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల దాదాపు 10,000 ప్రమాదాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ సమీపంలో ఉన్న ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత శ్రీ తలంపులమ్మ లోవ దేవస్థానం అది.
ఎత్తయిన కొండ పర్వతాలపై కొన్ని వందల సంవత్సరాల కిందట స్వయంభుగా ఈ ప్రాంతంలో శ్రీ తలుపులమ్మ అమ్మవారు కొలువై ఉన్నారు. మహా మునులు ముఖ్యంగా అగర్షి మహర్షి తపస్సు చేస్తున్న తరుణంలో వారికి జలం అవసరమైన నేపథ్యంలో ఈ ప్రాంతంలో జలం పుట్టించడం ఆ జలం ఇప్పటికీ ఈ ప్రాంతంలో నీటికి ఎటువంటి కొరవా లేకుండా పొంగిపొర్లుతుందని ఇక్కడ చరిత్ర చెబుతుంది. అటువంటి పవిత్ర క్షేత్రానికి మరో అసలు సిసలైన ఆనవాయి ఉందని చెప్పుకోవచ్చు.
కొన్ని వందల సంవత్సరాల కిందట నుంచి ఈ పవిత్ర క్షేత్రంకు సంబంధించి ఎటువంటి వాహనం కొనుగోలు చేసిన భక్తులు వారికి సంబంధించిన బండి లేదా కారు నెంబర్ ఈ కొండ పర్వతాలపై రాసినట్లయితే శ్రీ తలంపులమ్మ అమ్మవారు ఎటువంటి సమస్యలు ప్రమాదాలు జరగకుండా కాపాడుతుందని ఒక విశ్వాసంతో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్న పర్వతాలపై భక్తులు రాస్తూ ఉంటారు. పూర్వం ఈ కొండలపై తెల్లని చాక్పీసులతో తొలుత ఈ నెంబర్లు రాసేవారు.
కాలక్రమేణ రంగులు సైతం రావడంతో రకరకాల రంగులతో ఈ కొండ అంచుల్లో బండి నెంబర్లు వారి కుటుంబ సభ్యుల పేర్లు సైతం వ్రాసుకుని చల్లగా చూడమ్మా తలంపులమ్మ అంటూ ఈ విధంగా ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఇది ఏమైనా నల్లగా ఉండే కొండలు వాటి అంచులు భక్తులు వారు రాసిన రంగురంగుల నెంబర్లతో ఎరుపు పసుపు మయంగాఆ ప్రాంతమంతా మారిపోయింది అని చెప్పుకోవచ్చు.
కొన్ని వందల సంవత్సరాల కిందటి ఆనవాయితీ ఇప్పటికీ ఈ ప్రాంతంలో కొనసాగుతుందంటే ఆ జగత్ జనని లలిత స్వరూపిణి ఏ విధంగా భక్తులను ముఖ్యంగా వాహన చోదుకులను కాపాడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు.