Health

ఈ క్యాన్సర్ వంశపారపర్యంగా వస్తుందా..? దాని నుంచి మిమ్మల్ని కాపాడుకోవాలంటే..?

కడుపు క్యాన్సర్ సాధారణంగా ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కడుపు క్యాన్సర్ వస్తే విపరీతంగా బరువు తగ్గుతారు. కడుపు నొప్పి తీవ్రంగా ఉంటుంది. స్టమక్ క్యాన్సర్ వస్తే దాని లక్షణాలు మొదట చర్మంపై, నోటిపై కనిపిస్తాయి. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కారణంగా.. పాపులోరిథ్రోడెర్మా ఆఫ్ ఓఫుజీ(PEO) అనే అరుదైన చర్మ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. జీవనశైలి, అలవాట్ల ద్వారా ఎక్కువ మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. వంశపారపర్యంగా కూడా ఈ వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయి.

బ్రెస్ట్‌ క్యాన్సర్‌, బోన్‌ క్యాన్సర్‌, లంగ్‌ క్యాన్సర్‌ వంటి చాలా రకాల క్యాన్సర్‌లు ఉండగా.. అందులో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఒకటి. దీన్ని స్టమక్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. కడుపు కణాల DNAలో జన్యు మార్పుల వల్ల స్టమక్ క్యాన్సర్ వస్తుంది. అంతేకాకుండా హెలికోబాక్టర్ పైలోరీ అనే ఒక సాధారణ బాక్టీరియ వల్ల కూడా ఈ క్యాన్సర్ సంభవించవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. లక్షణాలు.. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వ్యాధి ఉన్న వారు ఆహారాన్ని మింగడంలో చాలా ఇబ్బందిపడతారు. తక్కువ మొత్తంలో ఆహారం తిన్నా కడుపు నిండిన అనుభూతి ఉంటుంది.

ఆహారం తిన్న తర్వాత కడుపు ఉబ్బినట్లు అనిపించడం, పొత్తి కడుపు నొప్పి, గుండెల్లో మంట, అజీర్తి సమస్య, ఆకలిగా అనిపించక పోవడం, బరువు తగ్గడం, రక్తం వాంతి చేసుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిరోధించే ఆహారాలు.. ఈ క్యాన్సర్ నివారణలో కెరోటినాయిడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అవకాడో, బొప్పాయి, గుమ్మడికాయ, బత్తాయి, మొక్కజొన్న, గుడ్డు, బచ్చలికూర వంటి వాటిల్లో కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో వీటిని తరచూ డైట్‌లో చేర్చుకోవాలి. విటమిన్ -సి లభించే ఫుడ్స్ కూడా తీసుకుంటూ ఉండాలి.

ప్రధానంగా నారింజ, మిరియాలు, స్ట్రాబెర్రీ, బ్రోకలీ, బంగాళదుంపలు, బెల్ పెప్పర్స్, టమోటాలు, మామిడి పండ్లలో విటమిన్- సి పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనంతో విటమిన్ -సి ఉంటుంది. కాబట్టి ఇది గ్యాస్ట్రిక్ క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. విటమిన్- సి, కెరోటినాయిడ్స్ యాంటీఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. దీంతో డీఎన్‌ఏ డ్యామేజ్, క్యాన్సర్ ట్రాన్స్‌ఫర్‌మేషన్‌లో ఇతర ప్రభావాలను నివారించడంలో కీలక పాత్ర పోషించే ఆక్సిజన్ జాతులను ఇవి ఈ యాక్టివేట్ చేస్తాయి. అయితే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ నివారణలో విటమిన్- సి, కెరోటినాయిడ్స్ పాత్రపై ఖచ్చితమైన ఆధారాలు లేవని నిపుణులు అంటున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker