ఈ లక్షణాలు కనిపిస్తే లైంగికంగా సంక్రమించే వ్యాధులు మీకు సోకినట్లే..?
చెంపపై చిన్న ముద్దు లేదా సుదీర్ఘమైన, ఉద్వేగభరితమైన ముద్దు రెండూ ఆమోదయోగ్యమైనవే. కానీ కొన్నిసార్లు ఈ ముద్దులు మీ ఆరోగ్యానికి హానికరం అని మీకు తెలుసా? లైంగిక కార్యకలాపాల సమయంలో సాధారణంగా వ్యాపించే అంటువ్యాధులను లైంగికంగా సంక్రమించే వ్యాధులు (STDలు లేదా STIలు) అని పిలుస్తారు. ఇవి చర్మం నుంచి చర్మానికి సంపర్కం, షేర్డ్ డ్రగ్ ఇంజెక్షన్లు లేదా సూదులు, శారీరక ద్రవం మార్పిడి, తల్లి నుంచి నవజాత శిశువులకు కూడా వ్యాప్తి చెందుతాయి.
ఇది వంధ్యత్వం వంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. లేదా ప్రాణాంతకం కూడా కావచ్చు. అయితే మానవ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా శృంగారం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అవును, శృంగారం వల్ల మనిషిపై ఉండే ఒత్తిడి, టెన్షన్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది. తద్వారా అతను మానసిక ప్రశాంతతను పొందగలుగుతాడు. ఇది మానవ ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే మారుతున్న కాలంలో లైంగికంగా సంక్రమించే వ్యాధులు(STDs) చాలా తేలికగా వ్యాపిస్తున్నాయి.
అలాగే వాటిని ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు, ఇంకా గుర్తించలేకపోతున్నారు. ఆ కారణంగానే హెచ్‌ఐవీ వంటి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించలేకపోతున్నారు. ఇక లైంగికంగా సంక్రమించే వ్యాధులు ప్రారంభమయ్యే ముందు మానవ శరీరంలో హెచ్చరిక లక్షణాలు లేదా సంకేతాలు కనిపిస్తుంటాయి. ఆ లక్షణాలేమిటో తెలుసుకుని వెంటనే చికిత్స తీసుకోవాలి. లేకపోతే అవి క్లామిడియా, గనేరియా, హెర్పెస్, హెచ్‌ఐవి వంటి సమస్యలుగా మారతాయి.
ఇంకా ఈ వ్యాధులు ఇతరుల నుంచి కూడా సంక్రమించవచ్చు. లైంగికంగా సంక్రమించే వ్యాధులను సూచించే కొన్ని హెచ్చరిక సంకేతాలివే.. అసాధారణ ఉత్సర్గ.. మీ మర్మాంగాల నుంచి ఏదైనా అసాధారణ ద్రవం బయటకు వస్తుందని మీరు గమనించినట్లయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. అయితే మీరు వైద్యుడిని సంప్రదించే ముందు మీ మర్మాంగాల నుంచి వచ్చే ద్రవం వాసన, రంగుని గుర్తించే ప్రయత్నం చేయండి.
మూత్ర విసర్జనలో ఇబ్బంది.. మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి అనిపిస్తే, మీ ప్రైవేట్ భాగాలలో ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. వారం అంత కంటే తక్కుల రోజులలో ఆ నొప్పి తగ్గకుండా అలాగే ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించి మీ సమస్య గురించి వివరించడం మరిచిపోకండి.