News

ఇండస్ట్రీలో విషాదం, స్టార్ హీరో తండ్రి కన్నుమూత.

ప్రముఖ జ్యోతిష్యుడు వీరేంద్ర ఖురానా నేడు చనిపోయారు. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నేడు పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఖురానా మరణంతో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ప్రముఖ జ్యోతిష్యుడు వీరేంద్ర ఖురానా అలియాస్ పి.ఖురానా శుక్రవారం ఉదయం కన్నుమూశారు. రెండు రోజులుగా సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఫోర్టిస్ ఆసుపత్రిలో ఆయనకు వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందించారు. కోలుకోలేక శుక్రవారం తుదిశ్వాస విడిచారు. పి.ఖురానా మరణంతో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు మణిమజ్ర శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు, ఆయుష్మాన్ ఖురానా అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పి.ఖురానా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. పి.ఖురానాకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఆయుష్మాన్ సోదరుడు అపర్శక్తి ఖురానా కూడా నటుడే కావడం విశేషం. ఆయుష్మాన్ ఖురానాకు తన తండ్రి పి.ఖురానా అంటే చాలా ఇష్టం. సోషల్ మీడియాలో ఎక్కువగా తన తండ్రి ఫోటోలను పంచుకుంటూ.. ఆయన గురించి చెబుతుంటాడు. నటుడు కావాలనే తన కలను తండ్రి సహకారంతో నిజం చేసుకున్నాడు. పండిత్ వీరేంద్ర ఖురానా అస్ట్రాలజర్‌గా చాలా ఫేమస్ అయ్యారు. ఆయన మాటలను ఎంతో మంది బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు పాటిస్తారు.

ఆ పరిచయాలతోనే తన ఇద్దరు కొడుకులను ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశారు. గత కొద్దిరోజులుగా గుండెపోటుతో బాధపడుతున్న పి.ఖురానా.. రెండు రోజుల క్రితం ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. ఆయన పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందించారు. దురదృష్టవశాత్తూ కోలుకోలేక తుది శ్వాస విడిచారు. విక్కీ డానర్ మూవీతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆయూష్మాన్ ఖురానా.. నటుడిగా విలక్షణ పాత్రలతో మెప్పించాడు.

ఆయూష్మాన్ నటించిన అంధాదున్ మూవీలోని యాక్టింగ్‌కు విక్కీ కౌశల్‌తో కలిపి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా అందుకున్నాడు. ఆయూష్మాన్ తమ్ముడు అపర్ శక్తి ఖురానా కూడా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. పంజాబ్ యూనివర్శిటీలో ఆయుష్మాన్‌కు సత్కారం ఉండగా.. తండ్రి మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker