Health

జీవితంలో ఒక్కసారైనా ఈ పండ్లు తినాలి, ఒక్కసారి తిన్నారంటే..?

పచ్చి స్టార్‌ ఫ్రూట్‌ అయితే కాస్త పుల్లగా గ్రీన్‌ యాపిల్‌ మాదిరిగా ఉంటుంది. సాధారణంగా ఇందులో తియ్యగా ఉండేవీ, కాస్త పుల్లగా ఉండేవీ రెండు రకాలున్నాయి. తియ్యనివి వేసవి నుంచి శీతాకాలం వరకూ కాస్తే పుల్లనివి వేసవి చివర నుంచి చలికాలం మధ్య వరకూ మాత్రమే కాస్తాయి. స్టార్ ఫ్రూట్‌ను తిన‌డం వ‌ల్ల అనేక లాభాలు ఉన్నాయి.

అయితే ప్రకృతిలో మనకు ఎన్నో రకాల పండ్లు తినేందుకు అందుబాటులో ఉన్నాయి. ఏ పండు ప్రత్యేకత దానిదే. ఒక్కో దాంట్లో ఒక్కో రకమైన పోషకాలు ఉంటాయి. అందువల్ల మనం అన్ని రకాల పండ్లను సీజన్లకు అనుగుణంగా తినాల్సిందే. ఇక మనకు కొన్ని ప్రత్యేక పండ్లు కూడా ఇప్పుడు విరివిగా లభిస్తున్నాయి. వాటిలో స్టార్‌ ఫ్రూట్‌ కూడా ఒకటి.

ఇప్పుడు మనం బయట ఎక్కడ చూసినా ఈ పండు మనకు కనిపిస్తోంది. అయితే స్టార్‌ ఫ్రూట్‌లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వాటిలో విటమిన్‌ సి, బి2, బి6, బి9, ఫైబర్‌, పొటాషియం, జింక్‌, ఐరన్‌లు ముఖ్యమైనవి. ఇవి మనకు సంపూర్ణ పోషణను అందించడంతోపాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. శరీరంలో ఎక్కువగా ఉండే నీటిని తొలగించడంలో ఈ పండ్లు అమోఘంగా పనిచేస్తాయి. దీంతో వాపులు తగ్గుతాయి.

స్టార్‌ ఫ్రూట్‌లను తినడం వల్ల దగ్గు, కామెర్లు, మలబద్దకం తగ్గుతాయి. అధిక బరువు తగ్గుతారు. హైబీపీ తగ్గుతుంది. కొలెస్ట్రాల్‌ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్‌ ఉన్నవారు ఈ పండ్లను తింటే షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయి. కిడ్నీ సమస్యలు దూరమవుతాయి.

అలాగే ఆటలమ్మ, తలనొప్పి, తామర వంటి వ్యాధులు కూడా తగ్గుతాయి. ఈ పండ్లను నేరుగా తినవచ్చు. లేదా కూరగా చేసుకుని అయినా తినవచ్చు. ఎలా తీసుకున్నా వీటితో మనకు ఆరోగ్యకర ప్రయోజనాలే కలుగుతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker