శృతి హాసన్ కి పిల్లలు పుట్టరా..? అరుదైన వ్యాధి బారిన పడిన స్టార్ హీరోయిన్.
టాలీవుడ్ సక్సెస్‌పుల్ హీరోయిన్గా రాణిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సలార్-2 చిత్రంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ చేసుకున్న ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకున్న ఓ అనారోగ్య సమస్య గురించి వెల్లడించింది. అయితే శృతి హాసన్ అరుదైన వ్యాధికి గురయ్యారు. ఆమెకు పిల్లలు పుట్టే సూచన కనబడం లేదు. ఈ మేరకు ఆమె స్వయంగా స్పందించారు. స్టార్ కిడ్ శృతి హాసన్ కెరీర్ బిగినింగ్ నుండి పలు ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంది.
అధికారికంగా ఆమె మైఖేల్ కోర్స్లే తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. లండన్ కి చెందిన మైఖేల్-శృతి కొన్నాళ్ళు ఘాడమైన ప్రేమలో మునిగి తేలారు. మైఖేల్ కోసం శృతి హాసన్ కెరీర్ కూడా వదిలేసింది. సినిమాలు చేయడకుండా లండన్ లో మకాం వేసింది. కెరీర్ పీక్స్ లో ఉండగా శృతి హాసన్ నిర్ణయం అందరికీ షాక్ ఇచ్చింది. మైఖేల్ ని కుటుంబ సభ్యులకు పరిచయం చేసింది. ఒకటి రెండుసార్లు చెన్నై కూడా వచ్చాడు. దాంతో మైఖేల్-శృతి పెళ్లి ఫిక్స్ అనుకున్నారు. అనూహ్యంగా 2019లో బ్రేకప్ చెప్పుకున్నారు.
శృతి కొంత డిప్రెషన్ అనుభవించినట్లు సమాచారం. ఇండియాకు వచ్చి కెరీర్ పై ఫోకస్ పెట్టింది. టాలీవుడ్ ఆమెకు బ్రేక్ ఇచ్చింది. క్రాక్, వకీల్ సాబ్ చిత్ర విజయాలతో మరలా ఫార్మ్ లోకి వచ్చింది. మరలా ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారిక తో ప్రేమలో పడింది. రెండేళ్లకు పైగా వీరు ప్రేమించుకుంటున్నారు. ముంబైలో వీరిద్దరూ ఒకే ఇంట్లో నివసిస్తున్నట్లు సమాచారం. శాంతను తో బహిర్గతంగా రిలేషన్ నడిపింది శృతి హాసన్. అతనితో ఉన్న ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసేది.
తాజాగా శాంతను ని సైతం ఆమె వదిలేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేటర్ ఎలా ఉంచితే… శృతి హాసన్ అరుదైన వ్యాధితో బాధపడుతుందట. ఆ వ్యాధి పేరు పీసిఓఎస్ అట. ఇది పీరియడ్స్ కి సంబందించిన సమయస అట. మొదటి పీరియడ్ నుండే ఆమెకు ఈ బాధ ఉందట. శృతి హాసన్ భరిస్తున్నారట. కాగా ఈ సమస్య ఉన్నవారికి పిల్లలు పుట్టడం కూడా కష్టమే అంటున్నారు. శృతి హాసన్ ఏళ్లుగా ఇలాంటి సమస్యతో భాదపడుతుందా అని ఫ్యాన్స్ వాపోతున్నారు. కాగా నెక్స్ట్ శృతి హాసన్ సలార్ 2, డెకాయిట్ చిత్రాల్లో నటిస్తుంది.