News

శ్రీలీలకు ఫోన్ చేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హీరో. ఎందుకో తెలుసా..?

గతంలో పెళ్లి సందడి సంగీతం అందించిన కీరవాణి, గీతా రచయిత చంద్రబోస్ ఈ సినిమాకి కూడా పనిచేయడం విశేషం. అంతేకాదు తండ్రి నటించిన టైటిల్‌తో తనయుడు హీరోగా నటించి హిట్ అందుకోవడం మరో విశేషం.

ఈచిత్రంలో రాఘవేంద్రరావు కూడా కీలక పాత్రలో కనిపించి అదరగొట్టారు. అయితే ఎంతోమంది యంగ్ హీరోలు సైతం తమ సినిమాలలో హీరోయిన్గా శ్రీలీల నే ఉండాలని భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో మూడు సినిమాలు ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా శ్రీలీల గురించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

చేతిలో ఇన్ని సినిమాలోతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మకు ఒక స్టార్ హీరో అవకాశం ఇవ్వడంతో కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక పోయిందట. గతంలో ఓకే చేసిన ఆ స్టార్ హీరో సినిమా నుంచి తప్పుకోవడానికి సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆ సినిమా డైరెక్టర్ కి చెప్పగా.. శ్రీ లీల కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా ఆ చిత్రం నుంచి తప్పుకోబోతున్నట్లు తెలియజేసిందట.

ఈ విషయాన్ని డైరెక్టర్ నేరుగా హీరోకి చెప్పడంతో.. హీరో డైరెక్టర్గా శ్రీ లీల కు ఫోన్ చేసి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం. ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే హీరోయిన్ గా కొనసాగించవచ్చు..లేకపోతే కొనసాగించడం కష్టమని చెప్పడంలో ఏలాంటి సందేహం లేదు.. మరి శ్రీలీలని బెదిరించిన ఆ స్టార్ హీరో ఎవరనే విషయం ఇంకా తెలియలేదు. మరి ఈ విషయంపై శ్రీ లీల స్పందిస్తుందేమో చూడాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker