News

శ్రీశైలంలో మహా అద్భుతం. మీరు దర్శించారా..!

శ్రీశైలం ఆలయంలో ఎన్నో వింతలు , విశేషాలు ఉన్నాయి. అంతేకాదు ఈ ఆలయం వెలసింది నల్లమల అడవులలో కావడంతో ఇక్కడి అడవులు, అక్కడ ఉండే అటవీ సంపద సైతం ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే ప్రముఖ పుణ్యక్షేత్రల్లో ఒకటైన శ్రీశైలంలోని మహా అద్భుతం జరిగింది.

పాతాళగంగ రోడ్డు మార్గంలోని ఉన్న వజ్రమ్మ గంగమ్మ సమీపంలో ఓ శివాలయం ఉంది. కాగా, అక్కడ నిత్యం శివుడికి అభిషేకాలు కూడా చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఎప్పటిలానే ఉదయం ఆ శివ లింగానికి భక్తులు అభిషేకం చేయాలని ఆలయానికి తరలివచ్చారు.

అయితే అక్కడ వాళ్లకు ఓ మహా అద్భుతం కనిపించింది. ఆలయంలో శివ లింగాన్ని చుట్టుకొని ఉన్న ఓ నాగు పాము కనిపించింది. ముఖ్యంగా ఆ పాము అటూ ఇటూ కదులుతూ నాట్యం చేయటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker