మీకు దండం పెడతా..! వదిలేయండి మహాప్రభో అంటూ శ్రీరెడ్డి కన్నీళ్లు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈమె నోటిమాట వచ్చిందంటే చాలు అన్నీ బూతులేనంటారు టీడీపీ, జనసేన అభిమానులు. అసలు తన మాటలను తూటాలుగా వదులుతూ వైరల్ గా మారిన సినీనటి శ్రీరెడ్డి తెలియని వారుండరు. వైసీపీ జోలికి వచ్చినా, మాజీ సీఎం జగన్ ను ఒక్క మాట విమర్శించినా నేను రెడీ అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శల బాణాలు ఎక్కుపెట్టడంలో ఎవరైనా శ్రీ రెడ్డి తరువాతే.
అలాంటి శ్రీ రెడ్డి పలుమార్లు ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో వ్యక్తిగతంగా కూడా విమర్శించారు. అయితే లోకేష్ గారూ మీకు సారీ, అలాగే మీ అమ్మ గారెకి, మీ భార్య గారెకి సారీ, అనిత గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికీ సారీ అంటూ శ్రీరెడ్డి ఇవాళ ఓ వీడియో విడుదల చేశారు.
నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ( మధ్యలో నాకు భవిష్యత్తు లేదనుకోండి నేను పెళ్లీ పెటాకులు అని అనుకోవట్లేదంటూ ) తన వల్ల తన కుటుంబానికి ఇబ్బంది రాకూడదని ఈ క్షమాపణ చెబుతున్నట్లు శ్రీరెడ్డి తెలిపారు. ఇకపై తన సోషల్ మీడియాలో మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని శ్రీరెడ్డి వెల్లడించారు.
ఏ విధమైన తప్పుడు వ్యాఖ్యలు చేయనని హామీ ఇచ్చారు. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకూ, మీకు కాకుండా లీడర్లు, లీడర్లకూ మధ్య జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ కార్యకర్తల్ని వదిలిపెట్టమంటూ విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటున్నట్లు శ్రీరెడ్డి ఎన్డీయే ప్రభుత్వానికి, నేతలకు విజ్ఞప్తి చేసారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమించండి .. దయచేసి నన్ను వదిలిపెట్టండి..!!#Srireddy #PawanKalyan #YSJagan #YSRCP #YSRCPSocialMedia #Oneindiatelugu pic.twitter.com/yOI9yF5co1
— oneindiatelugu (@oneindiatelugu) November 8, 2024