News

హీరో శ్రీరామ్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా..? ఎంత అందంగా ఉందొ చుడండి.

శ్రీరామ్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2002లో తమిళంలో రోజ కూటం తెలుగులో రోజా పూలు సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తమిళంతో పాటు, తెలుగు, మలయాళం సినిమాల్లో నటించాడు. అయితే తమిళంలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యాడు శ్రీరామ్. ఆ తర్వాత కొన్నాళ్లకు తెలుగులో పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించారు. తెలుగు సినిమాలకు చాలా కాలం గ్యాప్ తీసుకున్న శ్రీరామ్ వెంకటేశ్ నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.

ఇందులో వెంకీ స్నేహితుడిగా కనిపించారు. ఆ తర్వాత పోలీస్ పోలీస్, దడ, నిప్పు, సుప్రీమ్, లై, శ్రీనివాస కళ్యాణం, సీత, రాగల 24 గంటల్లో, నమస్తే నేస్తమా వంటి చిత్రాల్లో కీలకపాత్రలు పోషించారు. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. విజయ్ దళపతి హీరోగా నటించిన స్నేహితులు సినిమాలో శ్రీరామ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు వెండితెరపై కాకుండా ఓటీటీలోనూ అలరిస్తున్నారు.

ఇటీవలే పిండం అనే హార్రర్ వెబ్ సిరీస్ తో ఓటీటీ ప్లా్ట్ ఫామ్ పై సందడి చేశాడు. అలాగే ఇప్పుడు చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. శ్రీరామ్ ఫ్యామిలీ గురించి ప్రేక్షకులకు అంతగా తెలియదు. సినిమా ఫంక్షన్స్.. ప్రైవేట్ పార్టీలలోనూ శ్రీరామ్ తన ఫ్యామిలీతో కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. తాజాగా ఈ హీరో ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అందులో శ్రీరామ్ కూతురిని చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తున్న ఈ హీరోకు ఇంత పెద్ద కూతురు ఉందా ? అంటూ షాకవుతున్నారు.

శ్రీరామ్ 2008లో వందన అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె అహానా.. కుమారుడు ఆహిల్ ఉన్నారు. తాజాగా శ్రీరామ్ భార్య వందన తమ ఫ్యామిలీ గోవా వెకేషన్ లో ఉన్న ఫోటోస్ షేర్ చేసింది. అందులో శ్రీరామ్ కుమార్తే అహానా కూడా కనిపిస్తుంది. అహానా లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం శ్రీరామ్ ఫ్యామిలీ పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker