పెళ్లి పీటలెక్కబోతున్న శ్రీముఖి, వరుడు ఎవరో తెలుసా..!
మాటలతోనే కాదు అందంతోనూ కవ్విస్తుంది శ్రీముఖి. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో పాటు పలు ఇంటర్వ్యూలతోనూ ఆకట్టుకుంది శ్రీముఖి. ఇదిలా ఉంటే శ్రీ ముఖి పెళ్లి గురించి ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. ఇప్పటికే చాలా సార్లు ఆ వార్తలను ఖండిస్తూ వచ్చింది శ్రీముఖి. అయితే అది అలా ఉంటే శ్రీముఖి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ఆమె కొన్నాళ్లుగా ఓ వ్యక్తిని ప్రేమిస్తోందట. ఈ నేపథ్యంలో ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. మరో రెండు నెలల్లో శ్రీముఖి గుడ్ న్యూస్ చెప్ప నుందని తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో ప్రకటన రానుందట. శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నట్టు ఎప్పటి నుంచో ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
అయితే శ్రీముఖి వాటిపై ఇంక స్పందించలేదు. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్స్ బహుశా శ్రీముఖి ప్రేమించి పెళ్లి చేసుకోనుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం వినిపిస్తోన్న వదంతులు నిజమేనా? అంటే కాలమే సమాధానం చెప్పాలి. ఇక శ్రీముఖి రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. ఈ భామ ఒక్కో షోకు ఒక లక్ష నుంచి లక్ష యాబై వేల వరకు రెమ్యూనేషన్ తీసుకుంటుందట.
అయితే అది షోను బట్టి ఉంటుందట. ఇక సినిమాలకు సపరేట్ రెమ్యూనరేషన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. శ్రీముఖి ఇటు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లోను నటిస్తోంది. అందులో భాగంగా ఆమె మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన భోళా శంకర్ సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించించింది. ఈ సినిమాలో శ్రీముఖి, కీర్తి సురేష్ ఫ్రెండ్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. భోళా శంకర్ విషయానికి వస్తే.. చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే.