శ్రీకాళహస్తిలో రచ్చ రచ్చ చేసిన లేడీ అఘోరీ, చివరికి బయటపడిన ఆమె అసలు రూపం.
శ్రీకాళహస్తి ఆలయంలోకి వెళ్ళే ప్రయత్నం చేసిన అఘోరీని స్థానిక సెక్యూరిటీ గార్డులు అడ్డుకోవడంతో కారులో ఉన్న పెట్రోల్ డబ్బా తీసుకుని ఒంటిపై పోసుకుంది. ఆత్మార్పణకు యత్నం చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన అఘోరీ మాత ఇటీవల తెలంగాణా నుండి ఏపీకి వచ్చి కార్తీకమాసంలో ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేయటం మొదలు పెట్టారు. అయితే ఈ ఇంటర్వ్యూల్లో పొంతన లేని విషయాలు వెల్లడించడంతో లేడీ అఘోరీపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అసలు ఆమె లేడీ కాదని, హిజ్రా అని ప్రచారానికి తెరలేపారు. మనిషి మాంసం తింటాని, తనకు దేశంలోని చాలా భాషలు వస్తాయని మీడియా ముందు ప్రగల్భాలు పలికింది. అయితే ఉన్నట్టుండి లేడీ అఘోరీపై వ్యతిరేకత రావడంతో ఆమె యూట్యూబ్ చానల్స్ పై ఫైర్ అయ్యింది.
మీ అంతుచూస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది. ఆ తర్వాత తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తన గురువును కలిసేందుకు కేధార్ నాథ్ కు వెళ్లింది. తిరిగి తెలంగాణకు వచ్చిన లేడీ అఘోరీ ఆత్మార్పణం చేసుకుంటానని స్టేట్ మెంట్ ఇచ్చి షాక్ ఇచ్చింది. దీంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై ఆమెను తన తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. గృహనిర్భందం అనంతరం లేడీ ఆఘోరీన ఆంధ్రప్రదేశ్ కు పయనమైంది. ఈ క్రమంలో శ్రీకాళహస్తికి చేరుకుంది. ఇక అసలు వ్యవహారం ఇక్కడే మొదలైంది. లేడీ అఘోరీ కాళహస్తి పరమశివుడి ఆలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసింది.
అయితే ఆమెను సెక్యూరిటీ సిబ్బంది లోనికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో లేడీ అఘోరీ నానా హంగామా చేసింది. ఆలయంలోకి వెళ్లనివ్వకపోతే ఆత్మార్పణం చేసుకుంటానని క్యాన్ లో ఉన్న పెట్రోల్ ను తనమీద కుమ్మరించుకుని రచ్చ రచ్చ చేసింది. ఈ క్రమంలోనే లేడీ అఘోరీ అసలు రూపం లీక్ అయ్యింది. తొలిసారి లేడీ అఘోరీ అసలు రూపం చూసి జనాలు బిత్తరపోయారు. ఇంతకాలం ఒళ్లంతా విభూది పూసుకుని నుదిటన పెద్ద సైజులో కుంకుమ బొట్టుతో దర్శనమిచ్చింది. మెడలో రుద్రాక్ష దండలతో.. చేతులకు రుద్రాక్షలు కట్టుకుని పెదాలకు లిప్ స్టిక్ రాసుకుని లేడీ అఘోరీ హల్ చల్ చేసింది.
అయితే ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో అక్కడున్న వారు ఆమెను కాపాడేందుకు నీళ్లు కుమ్మరించారు. దీంతో లేడీ అఘోరీ అసలు రూపం వెలుగులోకి వచ్చింది. సాధారణ రూపంలో కనిపించే సరికి జనాలు అవాక్కయ్యారు. ఆ తర్వాత ఆలయంలోకి వెళ్లాలంటే దుస్తులు ధరించాలని చెప్పి అఘోరికి బట్టలు తొడిగించారు. కాసేపు ఆ ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం కొనసాగింది. పరిస్థితి చక్కబడ్డ అనంతరం పోలీసులు లేడీ అఘోరీని ఏపీ బార్డర్ దాటించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మరి లేడీ అఘోరీ అసలు రూపంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.