పెళ్లికి సిద్ధమైన అభిరామ్, దీంతో శ్రీ రెడ్డి ఏం చేసిందో తెలుసా..?
స్వర్గీయ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు నిర్మాతగా వ్యవహరించగా ఆయన తదనంతరం ఆయన వారసుడు దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తూ ఇప్పుడు కొత్త వాళ్లకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఇదిలా ఉండగా సురేష్ బాబు కొడుకులైన దగ్గుబాటి రానా, దగ్గుబాటి అభిరామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఫిలిం చాంబర్ ముందు అర్ధ నగ్న ప్రదర్శన చేయడంతో జాతీయస్థాయిలో శ్రీరెడ్డి పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది.
ముఖ్యంగా ఈమె వల్లే దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి అభిరామ్ కూడా వార్తల్లో నిలిచాడు. ఇక ఈ క్రమంలోనే శ్రీరెడ్డి తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇకపోతే గతంలో దగ్గుబాటి అభిరామ్ తనను శారీరకంగా వాడుకున్నాడు అని, అవకాశాలు ఇప్పిస్తానని సర్వం దోచుకున్నాడని ఇక అవకాశాలు తీరాక వదిలేసాడని గతంలో ఆమె ఆరోపణలు చేసింది.
అంతేకాదు మీడియా ముందే అభిరామ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను, సెల్ఫీలను కూడా షేర్ చేసింది. ఇక శ్రీరెడ్డి ఇంత రచ్చ చేస్తున్నప్పటికీ అభిరామ్ నోరు మెదపలేదు అంటే కచ్చితంగా అతను తప్పు చేసి ఉంటాడు అని కూడా అందరికీ స్పష్టమైంది. తాజాగా అతడి ఎంట్రీ గురించి ఆమె వ్యాఖ్యానిస్తూ మరికొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక అభిరామ్ కొత్త సినిమా అహింస ప్రస్తావన రాగానే తన స్టైల్ లో రియాక్ట్ అయిన శ్రీ రెడ్డి దగ్గుబాటి అభిరామ్ అహింస సినిమా గురించి మాట్లాడుతూ.
అభిరామ్ గాలి తీసేసింది.. అహింసనా..? వాడికి హింస తప్ప మరోటి రాదు.. అహింస అనే సినిమాతో వస్తున్నాడా అన్న టైప్లో కౌంటర్లు వేసింది.. ఇక వాడి సినిమా ఎలా హిట్ అవుతుందో నేను కూడా చూస్తాను అంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.