బాయ్ ఫ్రెండ్ చేతుల్లో చావు దెబ్బలు తిన్న స్టార్ హీరోయిన్.
సినిమా ప్రొడ్యూసర్ గా ఉన్న గౌరంగ్ దోషితో ఫ్లోరాకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి సహజీవనం కొనసాగించారు. అతడి కోసం ఫ్లోరా తన కుటుంబ సభ్యులను కాదని మరీ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. తొలుత తనను బాగానే చూసుకున్నాడు. కొంత కాలం తర్వాతే తన నిజ స్వరూపం బయటపడిందని వెల్లడించింది.
తాజాగా జరిగిన శ్రద్ధా వాకర్ హత్య గురించి స్పందించిన ఫ్లోరా, తనూ అలాంటి బాధనే అనుభవించినట్లు చెప్పింది. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా తనకు జరిగిన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. తన మాజీ ప్రియుడు తనను దారుణంగా హింసించాడని చెప్పుకుంది. ఆ ఆ హీరోయిన్ ఎవరో కాదు ఫ్లోరా షైనీ. హీరోయిన్ ప్లోరా శైని అలియాస్ ఆశాషైనీ టాలీవుడ్ కి బాగా సుపరిచితమే. అంతా మన మంచికే
చిత్రంతో పరిచయం అయ్యింది.
ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. ‘నరసింహ నాయిడు, నువ్వు నాకు నచ్చావు, ప్రేమతో రా, సొంతంలాంటి సినిమాల్లో నటించింది. తాజాగా ఈ భామ శ్రద్దా వాకర్ ఘటన గురించి మాట్లాడుతూ.. తన జీవితంలో కూడా ఇదే తరహా ఘటన జరిగిందని తెలిపింది. నా బాయ్ ఫ్రెండ్, నన్ను నా కుటుంబం నుంచి దూరం చేశాడు. ఇంటి నుంచి నేను బయటకొచ్చిన కొద్దిరోజుల్లోనే అతడి అసలు రూపం బయట పడింది.
నన్ను తీవ్రంగా హింసించేవాడు. రోజు కారణం లేకుండా కొట్టేవాడు అని చెప్పుకుంది. తనకోసం అందరినీ వదిలేసి వస్తే.. నన్ను చిత్రహింసలు పెట్టాడు అని తెలిపింది. తన మాజీ ప్రియుడు గౌరవ్ దోషి శారీరకంగా..మానసికంగా ఎంతలా హింసించే వాడు చెప్పి వాపోయింది ఆశ. అతని చేతుల్లో చావు దెబ్బలు తిన్నాను. అతని చేతుల్లో చావు దెబ్బలు తిన్నాను. అప్పుడు నేను ఒంటిపైన బట్టలు ఉన్నాయా లేవా ఆ ని కూడా చూడకుండా పరిగెత్తా.. అని చెప్పుకొని వాపోయింది.