News

శ్రద్ధా శ్రీనాథ్ ఎదపై ఉన్న టాటూ వెనుక అర్థమిదే. అసలు సీక్రెట్ తెలిస్తే..?

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇందులో మినహాయింపు ఏం కాదు. ఇప్పుడు కూడా ఓ యంగ్ హీరోయిన్.. అలా తన ఎదపై ఉన్న పచ్చబొట్టు మీనింగ్, అసలు ఇది ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది.

శ్రద్ధా శ్రీనాథ్.. స్వతహాగా కన్నడ బ్యూటీ. 2015లో ఓ మలయాళ మూవీతో నటిగా కెరీర్ ప్రారంభించింది. తాను ఏదో ఒక సినిమా చేసేయాలి. డబ్బులు సంపాదించాలని తాను ఇండస్ట్రీలోకి రాలేదని, తాను నటిగా నిరూపించుకునే పాత్రలు లభించినప్పుడు, మంచి సినిమాలు మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చింది.

ఏదో ఒక సినిమా చేయాలనే ఉద్దేశం తనకు ఉండదట. ప్రేమ, బ్రేకప్ వంటి కాన్సెప్టులతో వచ్చే చిత్రాలు, ఆ జానర్లు అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. అందుకే శ్రద్దా శ్రీనాథ్ కృష్ణ అండ్ హిజ్ లీలా, జెర్సీ వంటి ఎమోషనల్ డ్రామాలను ఎంచుకుందన్న మాట.

పా రంజిత్‌తో ఓ సినిమా చేయాలని తనకు ఉందని చెప్పుకొచ్చింది శ్రద్దా శ్రీనాథ్. తన టాటూనికూడా గమనిస్తున్నారా? వావ్ అంటూ శ్రద్దా శ్రీనాథ్ మురిసిపోయింది. ఆ టాటూకి లవ్ అని అర్థమట. అది బీటల్స్ మ్యూజిక్ బ్రాండ్‌ లోగో అని చెప్పుకొచ్చింది. అది తన క్రష్. పద్దెనిమిదేళ్ల వయసులో అతడు క్రష్‌గా ఉండేవాడట.

అతనే ఆ మ్యూజిక్ బ్యాండ్‌నే పరిచయం చేశాడట. అలా క్రష్‌నే టాటూగా వేయించుకుందట.క్రష్‌ మాత్రమే లవ్ కాదు. క్రష్‌కి కూడా టాటూ వేయించుకుంటారా? అని యాంకర్ అడిగగా శ్రద్దా శ్రీనాథ్ నవ్వేసింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker