స్వర్గీయ Sr.NTR పక్కన ఉన్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా..?
కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తన దైన ముద్ర వేయగలిగారు. ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసులుగా హరికృష్ణ, బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. వీరి తర్వా తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, తారక రత్నలు హీరోలుగా రాణించారు. ఇదిలా ఉంటే స్వర్గీయ నందమూరి తారక రామారావుకు సంబంధించి ఒక ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ హీరోలుగా తమ సత్తా చాటుతున్నారు.
వీరి బాటలోనే మరో హీరో ‘బ్రీత్ ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంతకీ ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా? ఆయన పేరు నందమూరి చైతన్యకృష్ణ. దివంగత ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ తయుడు ఈ చైతన్యకృష్ణ. ప్రస్తుతం ఈ హీరో పేరుసోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గత ఏడాది డిసెంబర్ 2న ‘బ్రీత్’ రిలీజ్ అయ్యింది.. ఒక్క పైసా కూడా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. మెడికల్ మాఫియా నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో చైతన్య కృష్ణ ఆకట్టుకోలేకపోయాడని టాక్ వినిపించింది.
సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కొడుకు చైతన్య కృష్ణ. సినిమాలపై ఉన్న ప్రేమతో నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. 2003 లో జగపతిబాబు హీరోగా నటించిన ‘ధమ్’ మూవీలో కీలక పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత అవకాశలే పెద్దగా రాలేదు. చాలా సంవత్సరాలు వేయిట్ చేసిన చైతన్యకృష్ణ నటనపై ఆసక్తి తగ్గక ‘బ్రీత్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించారు.
సినిమాలే కాదు.. చైతన్య కృష్ణ రాజకీయాల్లో కూడా తనదైన మార్క్ చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో తన బాబాయి బాలకృష్ణ, మామ చంద్రబాబు, టీడీపీ పార్టీ గురించి మాట్లాడుతూ హల్ చల్ చేస్తున్నాడు. తాజాగా సీనియర్ ఎన్టీఆర్ తో జయకృష్ణ దిగిన చిన్ననాటి ఫోటో ఒకటి వైరల్ అవుతుంది.
Nandamuri Chaitanya Krishna బ్రీత్
— deve yadav 9999 (@ADevendraYadav2) June 24, 2023
వైద్యో నారాయణో హరిః
అంటూ కొత్త కథా కథనంతో మనముందుకు వస్తున్నాడు మరోసారి హీరోగా నటిస్తున్నారు. NandamuriChaitanyaKrishna pic.twitter.com/q4KvvIACBa