Health

వైద్యులు ఈ ఆకు కూరను ఎక్కువగా ఎందుకు తినమంటారో తెలుసా..?

బచ్చలికూరలో విటమిన్ ఎ, సి, ఇ మరియు కె, మెగ్నీషియం, ఫోలేట్, పొటాషియం, ఐరన్ మరియు కాపర్ పుష్కలంగా ఉన్నాయి. ఇది ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, డైటరీ ఫైబర్ మరియు ఫ్లేవనాయిడ్స్ యొక్క మంచి మూలం. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం, 100 గ్రాముల బచ్చలికూరలో 23kcal, 99mg కాల్షియం, 79mg మెగ్నీషియం, 558mg పొటాషియం, 28.1mg విటమిన్ సి మరియు 194mg ఫోలేట్ ఉంటాయి. అదనంగా, ఇది 79mg సోడియం మరియు 49mg భాస్వరం కూడా కలిగి ఉంటుంది.

అయితే మన‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల ఆకుకూర‌ల్లో బ‌చ్చ‌లి కూర ఒక‌టి. కానీ, బ‌చ్చ‌లికూరను చాలామంది ఇష్టపడరు.. దాంతో ఎప్పటికప్పడు ఈ బచ్చలికూరను పక్కకు నెట్టేస్తుంటారు..అయితే, బచ్చలికూరలో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం నిజంగా బంగారమే అంటారు. బచ్చలి పోష‌కాల‌కు నిల‌యంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. బచ్చలి బోలెడు ఔష‌ధ గుణాలు ఉంటాయి. బ‌చ్చ‌లికూర‌ను నేరుగా కూర‌,లేదా ప‌ప్పులా చేసుకు తిన‌వ‌చ్చు. ముఖ్యంగా బచ్చలి కూర శరీరానికి చాలా మంచిది.

రక్తహీనత సమస్యతో బాధపడేవారికి బచ్చలి కూర దివ్య ఔషదంలా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు తమ రోజు వారి ఆహారంలో బచ్చలికూరను చేర్చుకుంటే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడతారని సూచిస్తున్నారు. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి బచ్చలికూర దివ్యౌషధంలా పనిచేస్తుంది. హైబీపీ పేషెంట్లు తమ రోజు వారి ఆహారంలో బచ్చలికూరను చేర్చుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బచ్చలి ఆకులను రసంగా కూడా చేసుకుని తాగుతుంటే..రక్తపోటు అదుపులో ఉంటుంది.

అంతేకాదు.. బచ్చలి కూర గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బచ్చలికూరను తరచూ తీసుకోవటం ద్వారా శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ కరుగుతుంది. మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచుతుంది. బచ్చలి కూరలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. బచ్చలి కూరలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, నియాసిన్, సెలీనియం అధికంగా ఉంటాయి. ఇవి నరాల ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. అధిక బరువుతో బాధపడేవారికి బచ్చలికూర చక్కటి డైట్.

ఎందుకంటే బరువు తగ్గాలనుకునే వారు తమ రోజు వారి ఆహారంలో బచ్చలి కూరను చేర్చుకోవడం మంచిది. మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడేవారు రెగ్యులర్‌గా బచ్చలి కూరను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. బచ్చలి కూర వల్ల మూత్రం విసర్జనలో సమస్యలు తొలగిపోతాయి. పైల్స్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు బచ్చలికూరను తింటే ఈ సమస్యను ఉపశమనం లభిస్తుందట. ఈ వేసవిలో బచ్చలి కూరను తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే బచ్చలికూర ఒంట్లో వేడిని తగ్గిస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker