అరచేతులు, అరికాళ్లు ఎక్కువగా చెమటలు పడుతోందా..? ఈ రోగాలు ఉండొచ్చు.
అరచేతులు, అరికాళ్ళలో చెమటలు పడుతుంటే వైద్యులను సంప్రదించడం మంచిదంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఈ సమస్యతో పోరాడుతున్నారు. సైన్స్ భాషలో దీనిని హైపర్ హైడ్రోసిస్ అంటారు . సాధారణంగా శరీరం చెమట సహాయంతో దాని ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఎండకాలంలో చెమటపట్టడం చాలా కామన్.
కాలాలతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి పాదాల్లో చెమట పట్టడం ప్రమాదకరమైన రోగాలకు సంకేతం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనిని సకాలంలో గుర్తించకపోతే ప్రాణాల మీదికి రావొచ్చంటున్నారు నిపుణులు. పాదాలలో చెమట పట్టడం డయాబెటీస్ లక్షణం. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే పాదాల్లో చెమటపడుతుంది. మీరు ఏదైనా ఆహారం తిన్నవెంటనే అరికాళ్లలల్లో చెమట పడితే.. అది మధుమేహం వల్లేనని అర్థం చేసుకోండి. ఇందుకోసం టెస్ట్ చేయించుకోవడం మంచిది.
గుండెకు సంబంధించిన సమస్యల వల్ల కూడా ఇలా అరికాళ్లలో చెమటలు పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కంగారు వల్ల అరికాళ్లలో చెమట పట్టడం, చెమట వల్ల అరికాళ్లు చలబడటం గుండె సంబంధించిన సమస్యలకు సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు. ఈ లక్షణాలు హార్ట్ ఎటాక్ కు ముందు కనిస్తాయి. చెమట పట్టడంతో పాటుగా ఛాతిలో నొప్పి ఉంటే అది ఖచ్చితంగా గుండెకు సంబంధించిన సమస్యకు కారణమని గుర్తించండి.
ఇలాంటి సమయంలో ఆలస్యం చేయకుండా హాస్పటల్ కు వెళ్లడం మంచిది. ఆడవారిలో రుతుస్రావం ఆగిపోవడాన్ని రుతువిరతి అంటారు. అయితే ఈ రుతువిరతికి ముందు కూడా అరికాళ్లలో చెమటపడుతుంది. ఇది రుతువిరతికి సంకేతం. 40 ఏండ్లు దాటిన ఆడవారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తే రుతువిరతి అని అర్థం చేసుకోండి. థైరాయిడ్ సమస్య వస్తే మన శరీరంలో ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో ఒకటి అరికాళ్లలో చెమట పట్టడం.
థైరాయిడ్ డేంజర్ వ్యాధి. దీనిని వీలైనంత తొందరగా గుర్తించాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. అందుకే ఈ లక్షణం కనిపించినప్పుడు థైరాయిడ్ టెస్ట్ ను తప్పకుండా చేయించుకోండి. అరికాళ్లలో చెమటలు పట్టడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. సంక్రామ్యత వల్ల కూడా అరికాళ్లలో చెమట పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇలా అవుతుంది. మెడిసిన్స్ ను ఎక్కువగా వేసుకోవడం, ఊపిరితిత్తుల సమస్యలు, స్ట్రోక్ వల్ల కూడా ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.