Health

నిద్రపోయే ముందు ఈ సోయా పాలు తాగితే చెడు కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోతుంది.

చాలా మందికి పాలంటే అస్సలు నచ్చదు. కానీ పాలు మన ఆరోగ్యానికి ఎన్నో పోషకాలను అందిస్తాయి. అందుకే రోజూ గ్లాస్ పాలను తాగాలని చెప్తుంటారు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు. అయితే పాలను తాగలేను అనుకునే వారికి సోయా పాలు గొప్ప ఎంపిక. ఈ పాలు సోయాబీన్స్ నుంచి మాత్రమే తయారవుతాయి. నిజానికి ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల శక్తి కేంద్రం. ఈ పాలలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ పాలలో కాల్షియం, పొటాషియం లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు లాక్టోస్ అసహనం ఉన్నవారికి సోయా పాలు ఆరోగ్యకరమైన పాల ప్రత్యామ్నాయం.

అయితే సోయా పాలు పోషకాల నిధిగా కూడా పిలుస్తారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. అంతేకాకుండా ఇందులో పొటాషియం, సోడియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఈ పాలను ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సోయా పాల ప్రయోజనాలు..

సోయాబీన్ పాలు ప్రతి రోజూ తాగితే శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచుతాయి. ఇందులో ఫైబర్ వంటి మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి సులభంగా రక్తహీనత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సోయాబీన్ పాలు బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్-డి, క్యాల్షియం ఎముకలను దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకుంటే సోయాబీన్ పాలు కీలక పాత్ర పోషిస్తాయి.

ఇందులో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నవారు డైరీ మిల్క్‌కు బదులుగా సోయా మిల్క్ తాగాలి. ఎందుకంటే ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు గుండెను ఆరోగ్యంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. వీరు సోయామిల్క్ అస్సలు తాగొద్దు.. అండాశయానికి సంబంధించిన సమస్యలు ఉన్న స్త్రీలు ఈ పాలను తాగకుండా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

దీని వల్ల అలెర్జీ, ఇతర చర్మ సమస్యలకు దారి తీయోచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు అస్సలు సోయా పాలు తాగొద్దు. ఇందులో ఈస్ట్రోజెన్ అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇది శరీరంలో హార్మోన్లను పెంచేందుకు సహాయపడుతుంది. కాబట్టి అతిగా ఈ పాలను తాగొద్దు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker