సౌందర్య మరణంపై సంచలన విషయాలు వెల్లడించిన సీనియర్ హీరో.
సౌందర్య ఎప్పుడూ అందంగా కనిపించడానికి ఇష్టపడతారు. షూటింగ్ లో షాట్ గ్యాప్ లో కూడా మేకప్ టచ్ అప్ చేసుకునేవారు. లుక్ పర్ఫెక్ట్ గా ఉండాలనుకునేవారు. అలాంటి సౌందర్య చివరి క్షణాలు దారుణంగా గడిచాయి. ఆమెకు తల లేకుండా పోయింది. సౌందర్య మరణం తర్వాత జీవితం అంటే ఇంతేనా అనిపించింది. అయితే దశాబ్దాలపాటు సినీ పరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన సౌందర్య మరణం ఇప్పటికీ చేదు నిజం. వివాదాలకు దూరంగా తన సింప్లిసిటీతో కూడా ఆర్టిస్టుల మనసు గెలుచుకుంది. కానీ అనుకోని సంఘటనతో ఈ లోకం నుంచి దూరమైంది.
మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, సూపర్ స్టార్ కృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. అలాగే ఇతర భాషల స్టార్స్ అందరి జోడిగా కనిపించింది. తాజాగా సౌందర్య మరణంపై శాండల్ వుడ్ సీనియర్ హీరో రమేశ్ అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీ కన్నడలో ప్రసారమయ్యే మహానటి కార్యక్రమంలో నటుడు రమేష్ అరవింద్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. రమేష్‌తో పాటు దర్శకుడు తరుణ్ సుధీర్, నటి ప్రేమ, నిశ్విక నాయుడు కూడా న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. గత వారం ఎపిసోడ్‌లో నటుడు రమేష్ అరవింద్ నటి సౌందర్యను గుర్తు చేసుకున్నారు.
నటి సౌందర్య మరణవార్త విని నమ్మలేకపోయానని అన్నారు. ఆప్తమిత్ర (చంద్రముఖి) సినిమాలో నటుడు రమేష్ అరవింద్ భార్యగా సౌందర్య నటించింది. ఈ మూవీలో చంద్రముఖి ఆవహించిన గంగ పాత్రలో సౌందర్య కనిపించింది. రమేశ్ మాట్లాడుతూ.. ” ఆప్తమిత్ర షూటింగ్ సమయంలో క్లైమాక్స్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. అప్పుడు రంగోలిలో కమండలం వేశారు. సౌందర్య నటన ఎలా ఉందంటే నాగవల్లి ఆమెలో నిజంగానే ప్రవేశించి ఆ రంగోలిలోకి వెళఅలిపోయినట్లు అనిపించింది. ఆమె నటనను అందరం అలా చూస్తుండిపోయాం. ఆ తర్వాత తనే వచ్చి డిస్టర్బ్ చేయకు అని వెళ్లిపోయారు.
ఎలాంటి పాత్రలోనైనా జీవించేవారు. ఆమె అంత చిన్న విమానంలో ఎలా కూర్చుంది ?.. అసలు ఎందుకు వెళ్లింది ? అనే ప్రశ్న నాలో ఇప్పటికీ ఉండిపోయింది. సౌందర్య మరణించినప్పుడు నేను సినిమా షూటింగ్‌లో ఉన్నాను. ఆమె ఇక లేదు అని వార్తలు వచ్చాయి. నేను నిజంగా నమ్మలేకపోయాను. వెంటనే ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోలేదు. ఆ తర్వాత మళ్లీ మళ్లీ ఆమెకు ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఈ వార్తలు అవాస్తవమని, ఆమె ఫోన్‌లో మరొకరితో మాట్లాడుతుందేమో అని పదేపదే కాల్ చేశాను.
అయినా స్పందన రాలేదు ” అంటూ చెప్పుకొచ్చారు. 2004లో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయడానికి తెలంగాణలోని కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడానికి 2004 జూలై 7న బెంగుళూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరారు. కాసేపటికే ఆమె ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో సౌందర్యతోపాటు ఆమె సోదరుడు మరణించారు.