క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన బ్యూటీ, పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఎలా ఉందొ చుడండి.
తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్గా కొనసాగింది. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన బొంబాయి సినిమాలో హమ్మా హమ్మా పాటతో సౌత్ ఇండియాలో ఫేమస్ అయ్యింది. ఈ పాట సోనాలి కెరీర్ కు మంచి బ్రేక్ వచ్చింది. ఒకవేళ ఈ సాంగ్ హిట్ కాకపోతే సినీ పరిశ్రమను వదిలేయాలని ఫిక్స్ అయ్యిందట ఈ బ్యూటీ. అయితే సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ రంగుల ప్రపంచంలోకి సోనాలి బింద్రే అడుగుపెట్టారు.
ఈ క్రమంలో ఆమె పలు రియాలిటీ షోలలో జడ్జ్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 2 వెబ్ సిరీస్‌లో కనిపిచనున్నారు. జీ5 వేదికగా మే3 నుంచి ఇది ప్రసారం కానుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా చాలా రోజుల తర్వాత ఆమె పలు ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా కూడా తన కుటుంబం కోసం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె.. 90వ దశకంలో టాప్ హీరోయిన్గా కొనసాగారు. కానీ 2013 నుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పడు ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చారు. అందుకు కూడా కారణం ఉందని ఆమె ఇలా చెప్పుకొచ్చారు. ‘ఇప్పుడు నాకు కూడా డబ్బు అవసరం ఉంది. నేను చెల్లించాల్సిన బిల్లులు చాలా పెండింగ్‌లో ఉన్నాయి.
అందుకోసం నేను పని చేయవలసి ఉంది. నా కుటుంబం కూడా చాలా క్లిష్టమైన ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అని ఆమె తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత తమ అభిమాన హీరోయిన్ మళ్లీ ఎంట్రీ ఇస్తున్నడంతో ఫ్యాన్స్ కూడా స్వాగతం పలుకుతున్నారు.
Sonali Bendre was photographed at the airport wearing an adorable dress. 😍❤️#sonalibendre pic.twitter.com/ImRGFQUBgL
— Manas Bollywood (@Manasbollywood) April 23, 2024