పెళ్లైన పదిరోజులకే భర్తతో గోదావపడుతున్న స్టార్ హీరోయిన్.
సోనాక్షి-జహీర్ పూల్‌లో సన్ సెట్ హనీమూన్ ని ఆస్వాదిస్తూ కనిపించారు. వారి ప్రేమను వ్యక్తీకరించడానికి ఆ ఫోటోలు సరిపోతాయి. జహీర్ కూడా ఒక వీడియోను పంచుకున్నాడు, అందులో సోనాక్షి నల్లటి టీ-షర్ట్‌లో నాన్ స్టాప్‌గా నవ్వుతూ కనిపించింది. అయితే బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తన స్నేహితుడు జహీర్ ఇక్బాల్‌ను ప్రేమించిన సోనాక్షి.. మొదట్లో పెద్దలను నొప్పించినా.. ఆ తర్వాత ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంది.
జహీర్ ఇక్బాల్‌తో ప్రేమా, పెళ్లిపై సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా కోపంగా ఉన్నా.. తర్వాత కూతురి మనసు అర్థం చేసుకుని.. పెళ్లికి ఓకే చెప్పినట్లు వార్తలొచ్చాయి. జహీర్-సోనాక్షి పెళ్లి సమయంలో సోషల్ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. జహీర్ ఇక్బాల్‌పై లవ్ జిహాద్ అంటూ కొంతమంది సోషల్ మీడియాలో విద్వేషంతో కూడిన పోస్టులు చేశారు. కానీ, అన్ని అవంతరాలను దాటుకుని ఇటీవల జూన్ 23న పెళ్లి చేసుకున్నారు. తన జీవితంలో ఈ అరుదైన ఘటన గురించి సోనాక్షి తన మనసులోని సంతోసాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కూడా పంచుకుంది.
పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా సోనాక్షి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోనాక్షి-ఇక్బాల్ జంట చూడముచ్చటగా ఉందని సినిమా అభిమానులు మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ జంట హనీమూన్‌లో ఉంది. పెళ్లి తర్వాత హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్న సోనాక్షి-ఇక్బాల్ మధ్య సరదా సరదా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా సోనాక్షి భర్త జహీర్ ఇక్బాల్ పెట్టిన పోస్ట్‌లో.. ఆమె నాపై అరవాలనుకుంది.. కానీ నేను అమెను నవ్వించానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు.
అది చూసిన నెటిజన్లు.. పెళ్లి అయి పది రోజులు కూడా కాలేదు.. అప్పుడే మొదలెట్టార మొగుడుపెళ్లాం గొడవలు అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. భార్యలు అలగడం, అకారణంగా గొడవకు దిగడం, భర్తలు వాళ్లను బతిమాలడం సర్వసాధారణమే.. ఎంజాయ్ యూవర్ హనీమూన్ అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. మరి పెళ్లైన కొత్తలో సోనాక్షి-ఇక్బాల్ మధ్య జరుగుతున్న క్యూట్ ఫన్నీ గొడవలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.