ఈ సోంపు టీ తాగితే ఆ సమస్యలు జీవితంలో రావు.
హోటల్స్కి వెళ్లినప్పుడు అక్కడి భోజనం తిన్న తరువాత సోంపు ఇస్తారు. ఎందుకో తెలుసా.. తిన్న ఆహారం జీర్ణం కావడానికి. అయితే అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి జీర్ణాశయ సంబంధిత సమస్యలున్నవారు రోజుకు మూడుసార్లు సోంపు టీ తాగితే ఫలితం ఉంటుంది. సోంపు గింజల్లోని నూనెలు ఆహారం తొందరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతాయి.
అయితే జీర్ణక్రియ అనేది సరిగా లేకపోతే ఆ ప్రభావం రోజు వారీ పని పై తీవ్ర ప్రభావం చూపుతోంది. జీర్ణ సమస్యలను అధిగమించడానికి ఫెన్నెల్ టీ సహాయపడుతుంది. ఫెన్నెల్ టీ అనేక జీర్ణ సమస్యల నుంచి బయటపడటానికి మీకు సహాయపడుతుంది. ఫెన్నెల్ టీ తాగడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. సోంపు గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి. రోజూ నిద్రలేవగానే సోంపు టీ తాగితే ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
దీంతోపాటు శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. సోంపు గింజలు క్యాన్సర్ సమస్యను నివారించడంలో కూడా సహాయపడతాయి. కడుపు, చర్మం లేదా రొమ్ము క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్ల నుంచి మిమ్మల్ని రక్షించడానికి ఫెన్నెల్ సహాయపడుతుంది. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి మీ శరీరాన్ని రక్షిస్తుంది. ఫెన్నెల్ టీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వేడి ఫెన్నెల్ టీ తాగడం వల్ల రుతు సమస్యలు తగ్గుతాయి.
ఈ టీ శ్వాస కోశ సమస్య, ఉబ్బసం లక్షణాలను తగ్గించడానికి ఫెన్నెల్ సహాయపడుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. సోంపు కడుపులో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల సోంపును రెండు కప్పుల నీటిలో వేయండి. దీనికి కొన్ని పుదీనా ఆకులు జోడించండి. ఈ నీటిని రెండు మూడు నిమిషాలు మరిగించండి. రుచి కోసం తేనెను జోడించవచ్చు. ఇలా రోజూ తాగడం వల్ల అనేక సమస్యలకు దూరం కావొచ్చు.