News

శోభన్ బాబు కొడుకుని ఇండస్ట్రీలో హీరో కాకుండా అడ్డుకుంది ఎవరో తెలుసా..?

శోభన్ బాబు.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. టాలీవుడ్ అందగాడు శోభన్ బాబుకు అప్పట్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 80వ శతకంలో వారికి ఈయన అంటే విపరితమైన క్రేజ్. ముఖ్యంగా లేడీస్ లో శోభన్ బాబుకు ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. చిత్ర పరిశ్రమలో శోభన్ బాబు తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. అప్పటి స్టార్ హీరోలతో పోటీపడి సినిమాలు తీశారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యే సినిమాలు ఎక్కువగా చేశారు.

అయితే శోభన్ బాబు ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే సినిమాల్లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కుటుంబ నేపథ్య సినిమాల్లో నటిస్తూ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఈయన వందకు వంద శాతం సక్సెస్ అయ్యారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈయన కొడుకు కూడా ఇండస్ట్రీలోకి రావాలని శోభన్ బాబు అభిమానులు ఆశించారు. కానీ దీనికి భిన్నంగా ఆయన కెరీర్ ను ఎంపిక చేసుకున్నారు. కరుణ్ శేషు ఇండస్ట్రీలోకి రాకుండా అప్పటికే పలు వ్యాపారాలు స్థిరపడ్డాయట.

xr:d:DAF7VKhaV6Q:812,j:5546606620284451789,t:24040305

దీనికి కారణం ఓ వ్యక్తి తీసుకున్న నిర్ణయం అని టాక్. దీంతో ఇండస్ట్రీ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు శోభన్ బాబు కుమారుడు. అయితే ఈయన ఇండస్ట్రీలోకి రాకుండా అడ్డుకుంది ఎవరో కాదు ఆయన తండ్రి శోభన్ బాబే అని టాక్. అయితే తన కుమారుడిని ఇండస్ట్రీలోకి తీసుకురావాలని సినీ ప్రముఖులు అడిగారట కానీ తన కుమారుడు వ్యాపారంలో రాణించాలని భావించారట శోభన్ బాబు.

దీంతో సినిమాల వైపుకు ఆయనను తీసుకొని రాలేదు. కొడుకుకు కొంచెం ఆసక్తి ఉన్నా దాన్ని పక్కన పెట్టేసి బిజినెస్ లో మెలకువలు నేర్పించి వ్యాపారాలు చూసుకోమని చెప్పారట శోభన్ బాబు. అందుకే కరుణ శేషు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేకపోయారు. లేదంటే ఇతర హీరోల కుమారుల మాదిరి ఈయన కుమారుడు కూడా టాప్ హీరోలలో ఒకరిగా తన సత్తా చాటేవాడు కావచ్చు అంటారు శోభన్ బాబు అభిమానులు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker