శోభన్ బాబు సినిమా అంటే ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే, ఆ రహస్యం ఏంటో తెలిస్తే..?
శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. జనవరి 14, 1937న ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. కృష్ణా జిల్లా చిన నందిగామ ఇతని స్వగ్రామం.. తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణ రావు. మైలవరం ఉన్నత పాఠశాలలో చదివేరోజుల్లో శోభన్ బాబు నాటకాల పైన ఆసక్తి పెంచుకొని అనతికాలంలో మంచి నటుడిగా పేరు పొందాడు. అయితే శోభన్ బాబు హీరోగా వస్తున్నాడు అంటే ఆయనకి ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే అనే ఒక అభిప్రాయానికి ప్రేక్షకులు కూడా వచ్చేసారు.
అంటే ఆ విషయం ప్రేక్షకుల మీద ఎంత ఇంపాక్ట్ చూపించిందో మనం అర్థం చేసుకోవచ్చు.శోభన్ బాబు సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఎందుకు అని అంటే ఒకరితో ప్రేమాయానాలను నడిపిస్తూనే, మరొకరితో రిలాక్సేషన్ కోసం సాంగ్స్ ని గాని లేదా ఆమె నుంచి ఎదురయ్యే ప్రేమవల్ల జనరేట్ అయ్యే కామెడీని కానీ హైలెట్ చేస్తూ దర్శకుడు సినిమా మొత్తాన్ని నడిపిస్తూ ఉండేవాడు. అందుకే అప్పట్లో దర్శకులు ఆయన సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లను పెడుతూ ఉండేవారట.
ఇక దానికి తగ్గట్టుగానే ఇద్దరు హీరోయిన్లు ఉండటం వల్ల సినిమా మొత్తం చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. అలాగే హీరోయిన్లు కూడా చాలా అందంగా కనిపిస్తూనే తలుక్కున మెరిసేవారని చాలా మంది సినీ ప్రముఖులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేశారు. అయితే శోభన్ బాబు అప్పట్లో ఫ్యామిలీ స్టార్ గా తనకంటూ ఉన్న గుర్తింపును కాపాడుకుంటూ చివరి వరకు కూడా సోగ్గాడిగా తనకున్న ఇమేజ్ ను కాపాడుకుంటూ వచ్చాడు.
ఇక ఆయన అభిమానులకు తను ఎప్పటికీ హీరో గానే ఉండాలి అనే ఉద్దేశ్యంతో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా తను ఒక్క సినిమాలో కూడా నటించకుండా హీరోగా ఉన్నపుడే రిటైర్మెంట్ ప్రకటించాడు…అలా చేసిన ఏకైక హీరో కూడా శోభన్ బాబే కావడం విశేషం.