ఈ చిట్కాలతో గురక సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు.
సాధారణంగా ముక్కుల ద్వారా గాలి తీసుకుంటాం. కానీ, నాసికా మార్గాల్లో అవాంతరాల వల్ల కొందరు నోటితో శ్వాస తీసుకుంటుంటారు. అలర్జీలు, సైనస్ ఇన్ఫెక్షన్, ముక్కులోపలి భాగం వాచిపోవడం, అడినాయిడ్స్ అన్నీ కూడా శ్వాస మార్గానికి అడ్డంకులే కారణం.. అయితే నిద్రపోతున్నప్పడు ముక్కు నుంచి గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు ఏర్పడిన సమయంలో గురక వస్తుంది. గురక వచ్చినప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు.
ఆ మార్గంలోనూ అవాంతరాలుంటే అప్పుడు కుచించుకుపోయిన మార్గం నుంచి గాలి వెళ్లాల్సి ఉండడంతో చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కదలికకు గురై చప్పుళ్లు వస్తాయి. వాయు నాళాలు తక్కువ వ్యాకోచంతో ఉండటం వల్ల మెడ, గొంతు భాగంలో అధిక బరువు పడి గురకకు దారితీస్తుంది. మద్యం సేవించడం, సిగరెట్ స్మోకింగ్, ట్రాంక్విలైజర్ ఔషధాల వాడకంతో కూడా గురక వస్తుంది. ఇది ఒక కారణం మాత్రమే. వాస్తవంగా మరెన్నో అంశాలు ఉన్నాయి. ప్రధాన కారణంగా మానసికపరమైన ఒత్తిడి, కంగారు, విపరీతమైన ఆలోచనాధోరణి అని పరిశోధకులు నిర్ధారించారు.
గురకపెట్టకుండా ఉండాలంటే వాయుమార్గం తెరుచుకుని ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ముక్కు మూసుకుపోకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. వెల్లకిలా పడుకున్నప్పుడు గురక ఎక్కువగా వస్తుంది. అందుకని పక్కకు తిరిగి పడుకోవాలి. పడుకునేటప్పుడు తల భాగం ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. పడక గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. నిద్రపోయే ముందు మద్యం సేవించే అలవాటును పూర్తిగా మానుకోవాలి. ముక్కు రంధ్రాలు తెరిచి ఉంటే పట్టీలు వేసుకోవాలి. శరీరం బరువు పెరగడం వల్ల గడ్డం ప్రాంతంలో కొవ్వు కణజాలం పెరుకుపోయి కూడా గురక వస్తుంది. అందుకని శరీరం బరువు తగ్గించుకోవాలి.
యోగా, ప్రాణాయామం అలవాటు చేసుకోవడం వల్ల శ్వాసపై నియంత్రణ పెరిగి గురక తగ్గుతుంది. గొంతు, నాలుకకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. నిత్యం నిత్రపోయే ముందు గుప్పెడు పచ్చి అటుకులను తినడం వల్ల గురకను అదుపులో పెట్టుకోవచ్చు. అర టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి నిద్రపోయే ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది. గ్లాసు నీటిలో రెండు పిప్పర్‌మెంట్ ఆయిల్ చుక్కలు వేసి నోట్లో వేసుకుని బాగా పుక్కిలించాలి. గ్లాసెడు వేడి నీటిలో అర టీ స్పూన్‌ఖ యాలకుల పొడి కలిపి పడుకునే ముందు తాగాలి.