News

నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడు, నటి స్నేహ షాకింగ్ కామెంట్స్. ఆ అమ్మాయి ఎవరంటే..?

ఎన్నో సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించారు. తెలుగు , తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకాదరణ పొందారు స్నేహ. రామదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. గ్లామర్ రోల్స్ కు నో చెప్తూ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసి అలరించిన స్నేహాకు ప్రస్తుతం అవకాశాలు తగ్గిపోయాయి. ఆమె అడపా దడపా మాత్రమే సినిమాలు చేస్తున్నారు. ప్రసన్నను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలు మరీ తగ్గించేశారు స్నేహ. అయితే తెలుగులో ఆమె మొదటి చిత్రం ప్రియమైన నీకు.

తరుణ్ కి జంటగా నటించిన ఆ చిత్రం సూపర్ హిట్. ఆ తర్వాత వెంకీ, హనుమాన్ జంక్షన్, సంక్రాంతి, రాధా గోపాలం, శ్రీ రామదాసు వంటి పలు హిట్ చిత్రాల్లో నటించింది.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ స్నేహను బాగా ఆదరించారు. పెళ్లి తర్వాత స్నేహ జోరు తగ్గింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. 2012 లో నటుడు ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకుంది. 2009 లో ప్రసన్నకు జంటగా ఓ తమిళ చిత్రంలో నటించింది. ఆ సమయంలో వీరు ప్రేమలో పడ్డారు.

ఇక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కాగా వారికి ఇద్దరు సంతానం. ఒక ఒక పాప, బాబు తో చాలా హ్యాపీగా ఉంటున్నారు. అయితే తాజాగా స్నేహ ఓ ఇంటర్వ్యూలో తన భర్తపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె భర్త వేరే అమ్మాయిని ప్రేమించాడని చెప్పి బాంబ్ పేల్చింది. స్నేహ మాట్లాడుతూ .. నా భర్త గతంలో వేరే అమ్మాయిని ప్రేమించాడు. అయితే వాళ్లకు బ్రేకప్ అయిపోయింది. దాని వల్ల నాకు ఎలాంటి సమస్య లేదు.

నిజానికి ఆ అమ్మాయితో బ్రేకప్ అవ్వడం వలనే మేమిద్దరం కలిశాము. లేదంటే ఆయన నాకు భర్తగా దొరికి ఉండేవారు కాదు, అని స్నేహ అన్నారు. ప్రసన్న విషయంలో నేను చాలా లక్కీ అని ఆమె చెప్పారు. పెళ్ళైన కొత్తలో ఆమె కాస్త పొసెసివ్ గా ఉండేవారట. అలాగని నమ్మకం లేక కాదని స్నేహ క్లారిటీ ఇచ్చారు. స్నేహ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించారు. అయితే ఆమె చివరిగా తెలుగులో వినయ విధేయ రామ సినిమాలో కనిపించారు.

ఆ చిత్రంలో హీరో రామ్ చరణ్ వదిన పాత్ర చేసింది స్నేహ. కాగా స్నేహ ఇటీవల చీరల బిజినెస్ స్టార్ట్ చేశారు. అందులో కూడా ఆమె సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం పలు యాడ్స్ లో నటిస్తుంది. అలాగే టీవీ షోస్ కి జడ్జి గా వ్యవహరిస్తూ బిజీగా మారిపోయారు. ఆ మధ్య స్నేహ-ప్రసన్న విడిపోతున్నారంటూ పుకార్లు వినిపించాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker