నల్ల తాచు పాముతో నాగిని డ్యాన్స్ చేసిన యువతి, వైరల్ అవుతున్న వీడియో.
అడవి జంతువులు వాటి వింత ప్రవర్తనల వీడియోలు ఎప్పటికపుడు చూస్తూనే ఉంటాము.. వీటితో పాటుగా.. చెప్పాలంటే.. జంతువుల కన్నా పాములు వీడియోలే ఎక్కువగా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి నాగు పాము పడగ మీద నాలికతో ముద్దు పెట్టుకోవడం కనిపిస్తుంది. మరుక్షణం ఆ నాగుపాము తలని వెనక్కి తిప్పి ఆ యువతిని చూడటం ప్రారంభించింది.
తన వైపు చూస్తున్న కింగ్ కోబ్రా దగ్గర ఆ యువతి నాగినా డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. వీడియోలో మహిళ తన నాలుకని ఆడిస్తూ ఆ నల్ల తాచు తనవైపు వచ్చేలా పదే పదే చేస్తూనే ఉంది. ఈ సంఘటన ఎక్కడిది.. ఈ వీడియో ఎక్కడిది అనే విషయంపై స్పష్టమైన క్లారిటీ లేదు. అయితే కొంత మంది నెటిజన్లు ఈ వీడియో రాజస్థాన్‌లోని నాగౌర్‌కి చెబుతున్నారు. ఈ వీడియోలో ఉన్న యువతి స్వయంగా ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లక్కీ_udaan4090లో షేర్ చేసింది. ఇప్పటివరకు 1 లక్ష మందికి పైగా లైక్ చేశారు.
అయితే ఎక్కువ మంది వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. వివిధ రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. పాములతో ఇలాంటి ప్రమాదకరమైన రీతిలో ప్రవర్తించడం సరి కదాని.. ఇలాంటి వాటిని ప్రోత్సహించ వద్దని ఒక వినియోగదారు రాశారు. ఇది మూర్ఖత్వం అని అంటున్నారు. అదే సమయంలో, వన్యప్రాణులను గౌరవించండి అని మరొకరు చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం జీవులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని కామెంట్ చేయగా.. ఆమె అసలు ఇచ్చాధారిని నాగిని అంటూ మరికొందరు కామెంట్ చేశారు.